వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:39 AM
ద్వారకాతిరుమల శ్రీవారి ధనుర్మాస ఉత్సవం క్షేత్రం పురవీథుల్లో వైభవంగా జరిగింది.
తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారి దివ్యమూర్తులు
ప్రత్యేక అలంకరణ వాసవీ మాత
ద్వారకాతిరుమల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల శ్రీవారి ధనుర్మాస ఉత్సవం క్షేత్రం పురవీథుల్లో వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా స్వామివారు, ఉభయదేవేరులు, గోదాదేవితో కలిసి క్షేత్రపురవీ థుల్లో అట్టహాసంగా ఊరేగారు. ముందుగా బుధవారం ఉదయం ఆలయ ఆవరణలో తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్లతో పాటు గోదాదేవి ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలం కరణ చేశారు. అనంతరం గజ సేవతో పాటు మేళతాళాలు, డోలు సన్నాయి వాయిద్యాల నడుమ పురవీథుల్లో ఊరేగించారు. అనంతరం ధనుర్మాసమండపంలో గోదాదేవితో సహా శ్రీవారి, అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చి ప్రసాదవితర ణ చేశారు.
పెనుగొండ వాసవీ శాంతిధామ్‌లో..
పెనుగొండ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా పెనుగొండ వాసవీ ఽశాంతి ధామ్‌లో త్రయాహ్నిక చండీయాగ మహోత్సవం బుధవారం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. రెండవ శ్రీరంగముగా ప్రసిద్ధి చెందిన మండలంలోని కొఠాలపర్రులో స్వయంగా వెలిసిన కేశవస్వామి వారి ఽఆలయంలో ధనుర్మాస వేడుకలు నిర్వహించారు.