Share News

త్వరలో పోలీస్‌ అకాడమీ నిర్మాణం

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:33 AM

మండలంలోని నుగొండపల్లిలో ఏపీ పోలీస్‌ అకాడమీ సెంటర్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా బుధవారం పరిశీలించారు.

త్వరలో పోలీస్‌ అకాడమీ నిర్మాణం
పోలీస్‌ అకాడమీ సెంటర్‌ స్థలం పరిశీలిస్తున్న డీజీపీ గుప్తా

స్థలం పరిశీలించిన డీజీపీ గుప్తా

ఆగిరిపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నుగొండపల్లిలో ఏపీ పోలీస్‌ అకాడమీ సెంటర్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా బుధవారం పరిశీలించారు. పోలీస్‌ శిక్షణ సదుపాయాలు కలిగిన ఆధునిక పోలీస్‌ అకాడమీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీస్‌ శాఖకు అకాడమీ ఎంతో ఉపయోగకరమ ఆయన తెలిపారు. ఆయన వెంట అదనపు డీజీపీ మధుసూదనరెడ్డి, ఐజీ జీవీజీ.అశోక్‌కుమార్‌, డీఐజీ (పీ అండ్‌ ఎల్‌) సత్య ఏసుబాబు, ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్‌ శివ కిశోర్‌, సబ్‌ కలెక్టర్‌ స్మరణ్‌రాజ్‌, డీఎస్పీ కేవీవీఎన్‌వీ.ప్రసాద్‌, సీఐ కె.రామకృష్ణ, తహసీల్దార్‌ పీఎన్వీ ప్రసాద్‌, ఆగిరిపల్లి ఎస్‌ఐ కె.శుభశేఖర్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:34 AM