Share News

రాష్ట్రాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:33 AM

అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

రాష్ట్రాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం
తణుకులో సీసీ రహదారి ప్రారంభిస్తున్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి

తణుకు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అమరావతికి ప్రధాని మోదీని తీసుకువచ్చి ము ఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారని అన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొస్తున్నారని చెప్పారు. ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ వైసీ పీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లా డుతున్నారన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణా నికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి, ఆర్డీవో కతీప్‌ కౌసర్‌ బానో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యం.. మంత్రి జనార్దన్‌రెడ్డి ఆగ్రహం

తణుకు పట్టణంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆల స్యం కావడంపై నేషనల్‌ హైవే అధికారులపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. హైవే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నిర్మాణ పనులు జాప్యం కావడంపై వివరణ ఇవ్వాలన్నారు. సంబంధిత కాంట్రాక్టరుకు నోటీ సులు జారీ చేయాలని ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల అబివృద్ధిపై ఆశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.

Updated Date - Apr 11 , 2025 | 12:33 AM