Share News

ఎదగాలి.. ఒదగాలి!

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:45 AM

రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ జిల్లా పర్యటనకు రానుండడంతో ఇప్పుడు బీజేపీ కేడర్‌కు మరోమారు అగ్ని పరీక్ష ఎదురైంది.

 ఎదగాలి.. ఒదగాలి!

క్షేత్రస్థాయిలో కేడర్‌ ఆరాటం

తగ్గట్టుగానే పార్టీలో మార్పులు,చేర్పులు

గతం కంటే భిన్నంగా పరుగులు

మూడో తేదీన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ రాక.. సరికొత్త పరీక్షే

మాధవ్‌ రాకతో తొలి పరీక్ష

రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ జిల్లా పర్యటనకు రానుండడంతో ఇప్పుడు బీజేపీ కేడర్‌కు మరోమారు అగ్ని పరీక్ష ఎదురైంది. వచ్చే నెల మూడో తేదీన మాధవ్‌ జిల్లాకు రానున్నారు. ఆయన రోజంతా ఏలూరులోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసే దిశగా ఇప్పటి నుంచే పార్టీ నేతలంతా తలోపని పంచుకున్నారు. ఈ సారి కూడా పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో తపన చౌదరే ఈ వ్యవహారం అంతటిని దగ్గరుండి పర్య వేక్షిస్తున్నారు. అంతకుముందు రోజు భీమవరం లోను మాధవ్‌ పర్యటన ఉండడంతో దానికి ఏ మాత్రం తగ్గకుండా అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

కమలంలో కొత్త ఒరవడికి విశ్వప్రయత్నాలు జరు గుతున్నాయి. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పార్టీ కాస్తో, కూస్తో బలపడేలా ప్రయత్నాలు సాగాయి. కొన్ని నియోజక వర్గాల్లో పార్టీ అనుకున్నంతగా పురోగతి సాధించలేకపోయింది. అయితే ఈసారి కైకలూరు నియోజకవర్గంలో కమలానికి సరైన మద్దతే లభించి అక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ రెండోసారి ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండడం, పార్టీ కార్యక్రమాల అమలులో చొరవ చూపడం కైకలూరులో కొంత కలిసొచ్చింది. ఇక మిగిలిన స్థానాల్లో బీజేపీ చాన్నాళ్ల నుంచి విరామం లేకుండా శ్రమిస్తూనే ఉంది. పార్టీ బలబలాలు తెలియాలంటే గత ఎన్నికల్లో ఉమ్మడిగా కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే తెలిసి ఉండేది. కూటమి పేరిట పోటీకి దిగడంతో ఏ నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్ల శాతం ప్రభావితం చేసిందో అంచనా వేయడానికి వీల్లేకుండా పోయింది. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉండడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికల సమరంలో కీలకపాత్ర వహించారు. దీనికి తగ్గట్గుగానే జిల్లా కమిటీలను కాస్తో,కూస్తో ప్రక్షాళన చేశారు. క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న కొందరికి జిల్లా కమిటీలో స్థానం కల్పించగలిగారు. అయినా ఏదో లోటు పార్టీని వెన్నాడుతూనే వచ్చింది. క్షేత్రస్థాయిలో పార్టీ ఊహిం చిందొకటి, జరుగుతున్నది ఇంకొక్కటిగా మారింది. మరోమారు రాష్ట్ర నాయకత్వంలో కొత్తదనం నింపేం దుకు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించారు. జిల్లాల వారీగా పార్టీ స్థితిగతులపై దృష్టి పెడుతు న్నారు. ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఎవరైనా జిల్లాలకు వస్తే సాదాసీదాగానే కార్యక్రమా లు సాగాయి. క్రియాశీలక కార్యకర్తలు మాత్రమే వెన్నంటి ఉండేవారు. జిల్లాల వారీగా పార్టీ బలపడే దిశగా పెద్దగా చర్చలు జరిగేవి కావు. సూచనలు, సల హాలు ఇవ్వాలని చెప్పి ముగించేవారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తోంది, ఎవరు వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు, గతానికి ఇప్పటికి తేడా ఏమిటనేది.. విశ్లేషణ కొరవడింది. అందుకనే గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించి ఏళ్ల తరబడి కష్టపడినా గారపాటి సీతారామాంజనేయ చౌదరి వంటి నేతలు వెనుకబడి పోవాల్సి వచ్చింది. పార్టీ పదవుల్లోనూ సీనియర్లకు మొఖం చాటేసి తాము ఎంపిక చేసిన వారికే ప్రాధాన్యం లభిస్తూ వచ్చింది. అయితే ఈ మధ్యనే కొంచెం మార్పు కనిపిస్తోంది.

జిల్లాకే ప్రాధాన్యత..

సాధారణంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ, చురుకుదనం, కేడర్‌లో ఊపు తెచ్చే నేతలకే బీజేపీలో అత్యంత ప్రాధాన్యత ఉండేది. చాన్నాళ్ల తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఉపాధ్యక్ష హోదా కల్పించి, ఆ మేర కేడర్‌లో కొంతలో కొంత ఉత్సాహం నింపగలిగారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఈ మేరకు ముందు చూపు ప్రదర్శించారు. జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కామినేని శ్రీనివాస్‌ కొనసాగు తుండగానే ఇదే జిల్లాలో పార్టీ కార్యవర్గంలో ఇద్దరి నేతలకు ఒకేస్థాయి కలిగిన పదవులు ఇవ్వడం తాజా పరిణామంగానే పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా ఉన్న గారపాటి సీతా రామాంజనేయ చౌదరి (తపన చౌదరి)ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి పదోన్నతి కల్పించారు. గత ఎన్నికల హయాంలో బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్‌ జిల్లాలో పర్యటిం చేందుకు వీలుగా సన్నాహాలు చేసిన వారిలో తపన చౌదరి ఒకరు. ఈ ప్రాంతానికి సంబంధించి ఏలూరునే టార్గెట్‌గా చేసుకుని పార్టీ అగ్రనేతలు వచ్చినా, పలు కమిటీలకు చెందిన నేతలు వచ్చినా ఈ ప్రాంతాన్నే సిఫారసు చేసేవారు. ఇప్పుడు ఎలాగూ జిల్లా నాయకత్వంను చౌటపల్లి విక్రమ్‌ కిశోర్‌ సాధ్యమైనంత మేర ముందుకు నడిపేందుకు ప్రయత్ని స్తున్నారు. ఆయనతో పాటు పార్టీలో ఉన్న కృష్ణప్రసాద్‌, సుధాకర్‌ కృష్ణ వంటివారు పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటికి చురుగ్గానే ఉన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:45 AM