రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:58 AM
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఉండి మార్కెట్‌యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
ఉండి మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
ఉండి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఉండి మార్కెట్‌యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. మార్కెట్ యార్డుల ద్వారా పుంతరోడ్లు నిర్మాణం చేపడతామన్నారు. కేంద్రమంత్రి వర్మ మాట్లాడుతూ రైతులకు అండగా వుంటామన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్య నారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరు భరత్, జనసేన నాయకుడు వేగేశ్న కనకరాజు సూరి, ముత్యాల రత్నం, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీ కష్ణంరాజు, తోట ఫణికుమార్, మంతెన సాయిలచ్చిరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ : మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కలిదిండి రామకృష్ణరాజు (శ్రీను బాబు), వైస్ చైర్మన్‌గా యడవల్లి వెంకటేశ్వరరావు, నిచ్చెనకొలను సత్యవతి, ఆరేపల్లి నాగలక్ష్మీ, శీలం లక్ష్మీపార్వతి, బండి నాగరాజు, కమిలి వెంకట శివరామకృష్ణం రాజు, గొర్ల లక్ష్మీణస్వామి, నాగశాంతి, చింతాడ సుశీల, కుమారి, లంక మావుళ్లు, ఆరేపల్లి వెంక టేశ్వరరావు, వలవల శేషగిరి, మండ పద్మావతిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఉండి అబ్బాయిరాజు పార్కు నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.