రైతులకు అండగా నిలుస్తాం
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:56 AM
రైతులకు అండగా నిలుస్తామని రానున్న రెండు మాసాలలో డ్రెయిన్లు, కాలువలు, ఇతర ఆక్రమణలను తొలగించి నీటిపారుదల మెరుగుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటి స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
ఉండి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):రైతులకు అండగా నిలుస్తామని రానున్న రెండు మాసాలలో డ్రెయిన్లు, కాలువలు, ఇతర ఆక్రమణలను తొలగించి నీటిపారుదల మెరుగుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటి స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం వాండ్రంలంకలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరిచేలను బుధవారం కలెక్టరు నాగరాణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో 80 శాతం మేర డ్రెయిన్లు, కాలువ లపై ఆక్రమణలను తొలగించి నీటిపారుదల వ్యవస్థను స్థిరీకరించామన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కౌలు రైతులకు సీసీఏ కార్డుల మంజూరులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గ్రామంలోని 900 ఎకరాలకు గాను 50ఎకరాల వరి పంట నేలకొరిగిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పాలకోడేరు బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, తోట ఫణిబాబు, కందుల బలరాం, కరిమెరక నాగరాజు, కాగితబుజ్జి, అప్పల కృష్ణ, సూరవరపు వెంకటాచార్యులు, జిల్లా వ్యవసాయాఽ దికారి జడ్.వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నాగార్జున, ఏడీఏ జీవన్ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, వీఆర్‌వో చిన్నారావు, గ్రామ కార్యదర్శి నాయుడు పాల్గొన్నారు.