‘అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం’
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:13 AM
అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయకమని, ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులు ఉన్నా లేకపోయినా దాతల సహకారంతో అభివృద్ధిపరచడమే తన ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.
పాలకోడేరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయకమని, ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులు ఉన్నా లేకపోయినా దాతల సహకారంతో అభివృద్ధిపరచడమే తన ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం శృంగవృక్షం గ్రామంలోని ఐదు ఎకరాల్లో ఉన్న ఏఎంసీ కేంద్రాన్ని, గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన డ్వాక్రా భవనాన్ని, గ్రామంలో పేరుకుపోయిన ఆక్రమణలను పరిశీలించి మాట్లాడారు. అసంపూర్తిగా నిలిచిన డ్వాక్రా భవనాన్ని అభివృద్ధిపరిచేందుకు రూ. 15 లక్షలు అవసరం ఉందన్నారు. తన వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తానని, మిగిలిన మొత్తాన్ని దాతల సహకారంతో పనులు పూర్తి చేస్తామన్నారు. దీనిలోభాగంగా సోమవారం నుంచే ఆ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామంలో ఉన్న ఏఎంసీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్న స్థలం ఉపయోగించుకునేలా పరిష్కారాన్ని చూస్తామన్నారు. కార్యక్రమంలో పంతమని నాగరాజు, గ్రామ సర్పంచ్ జంగం సూరిబాబు, టీడీపీ నాయకులు కలిదిండి కృష్ణంరాజు, కొత్తపల్లి సూర్యనారాయణరాజు, ఎంపీటీసీ సత్యకృష్ణ, ప్రభుదాసు, నడిపూడి అప్పారావు, డ్వాకా ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్, డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు.