సురక్షిత తాగునీరే ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ స్పీకర్
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:14 AM
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే ల క్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ స్పీక ర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.
కాళ్ళ/పాలకోడేరు/ఆకివీడు, ఏప్రిల్ 17 (ఆం ధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే ల క్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ స్పీక ర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ళ మండలం ఏలూరుపాడులో సుమారు రూ.14లక్షలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్స్, హై స్కూల్‌లో వాలీబాల్, షటిల్ కోర్టులను గ్రామ సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. గ్రామానికి చెందిన రైతు నాయకులు మంతెన రవివర్మ తన తండ్రి సూర్యనారాయణరాజు పేరిట ఉండి నియోజకవర్గ ఇన్‌స్ట్రక్చర్ ఫండ్‌కు లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యేకి అందజేశారు. అనంతరం గ్రామస్థులు రఘురామకృష్ణరాజును సత్కరించారు. టీడీపీ గ్రామాధ్యక్షుడు మంతెన ఆంజనేయరాజు, వక్కపట్ల హరిబాబు, ఎంపీటీసీ చిన్నాపరపు రాంబాబు, సెక్యూరిటీ వాసు, మంతెన రవివర్మ తదితరులు పాల్గొన్నారు. పాలకోడేరు మండలం పెన్నాడలో మంచినీటి చెరువును పరిశీలించి ఆయన మాట్లాడారు. చెరువుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికోడు కాలువ నుంచి రూ.55 లక్షల నిధులతో నేరుగా స్వచ్ఛమైన మంచినీటిని రెండు నెలల్లో గ్రామ స్థులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ జిల్లా అనూషసత్యనారాయణ, తహసీల్దార్ ఎన్.భారతి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆకివీ డులో స్థానిక వెంకటలక్ష్మి థియేటర్ వెనుక భాగంలో వున్న ఖాళీ స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ప్రజల అవసరాల నిమిత్తం రెతు బజారు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. టీడీపీ మండల–పట్టణ అధ్యక్ష–కార్యదర్శులు మోటుపల్లి రామవరప్రసాద్, బొల్లా వెంకట్రావు, నౌకట్ల రామారావు, గంధం ఉమా, మాజీ సర్పంచ్ గొంట్లా గణపతి తదితరులు ఉన్నారు.