Share News

ఈ జడ్పీటీసీ అంత చులకనయ్యారా ?

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:36 AM

వైసీపీలో సరైన విలువ, గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో దెందులూరు జడ్పీటీసీ నవకాంతం దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ జడ్పీటీసీ అంత చులకనయ్యారా ?

వైసీపీలో విలువ, గౌరవం దక్కడం లేదని ఆవేదన.. పార్టీ కార్యక్రమాలకు దూరం

(దెందులూరు–ఆంధ్రజ్యోతి)

వైసీపీలో సరైన విలువ, గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో దెందులూరు జడ్పీటీసీ నవకాంతం దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కీలకమైన మండల నేతల వ్యవహారశైలి సక్ర మంగా లేదని పలువురు బాహాటంగానే విమ ర్శల వర్షం కురిపిస్తున్నారు. దళిత సామాజిక వర్గంలో ఓ మోస్తరు పేరున్నా నిట్టా లీలా నవ కాంతం 2021 జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజా ర్టీతో గెలుపొందారు. అయినా అప్పటి నుంచి పార్టీలో పెద్దగా విలువ ఇవ్వడం లేదని వాపో తున్నారు. ప్రస్తుతం అధికారం లో లేనప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వా నం, సంప్రదింపు లు లేక పోవడంతో ఆమె కొంత గుర్రుగా ఉన్నారు. ఆమె భర్త నిట్టా గంగ రాజు సీనియర్‌ లీడరే. నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ, ఇతర ధర్నాలు, నిరసనల్లో జడ్పీటీసీ పాల్గొన లేదు. ఇటీవల పార్టీకి దూరంగా ఉండడం ఉత్తమనన్న నిర్ణయం తీసుకోవడంతో ఆ సామాజిక వర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది. మనకు గుర్తింపు లేనప్పుడు.. ఇక్కడ కొనసాగడం అవసరమా? అన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వైసీపీ అభిమానులు, ఇతర నాయకులతో రహస్యంగా ఓ సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఇక పార్టీతో తాడేపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ‘మాకు తెలియకుండానే కార్యక్రమాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోను మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా..’ అంటూ జడ్పీటీసీ దంపతులు కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

Updated Date - Dec 05 , 2025 | 12:37 AM