Share News

మృత్యు శకటాలు..!

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:52 AM

రోడ్డు రవాణాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రారాజులుగా వర్ధిల్లు తున్నాయి. సౌకర్యవంతమైన వాల్వో ఏసీ, స్లీపర్‌ బస్సు సౌకర్యంతోపాటు తక్కువ సమయంలో గమ్యం చేరుస్తా మని ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు.

మృత్యు శకటాలు..!

శిక్షణ లేని డ్రైవర్లతో దూసుకుపోతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు !

మార్చి 10న ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద సర్వీసు రోడ్డులో ప్రయాణికులను దించిన బస్సు విజయవాడ వైపు వెళ్లే నిమిత్తం జాతీయ రహదారిపైకి అతి వేగంగా వస్తూ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడితే, మరో ఆరుగురు స్వల్ప గాయాల పాలయ్యారు.

ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై మార్చి 6వ తేదీ తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్‌ బస్సు–లారీ ఢీకొని నలుగురు మృత్యువాత పడ్డారు. మరో 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం..!

ఏడాది క్రితం భీమవరం పరిధిలోని దిరుసుమర్రు రోడ్డులో రొయ్యల కంపెనీ కూలీలను తీసుకువెళు తున్న బస్సు అదుపు తప్పి పంట బోదెలో తిరగబడిం ది. బస్సులోని 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫిట్‌నెస్‌ లేని, కాలం చెల్లిన బస్సుగా అధికారులు నిర్ధారించారు.

భీమవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి మం టలు రావడంతో ప్రయా ణికులు హాహాకారాలు చేశారు. బస్సును డ్రైవర్‌ ఆపడంతో అందరూ కిందకు దిగారు. బ్యాటరీలోంచి మంటలు వచ్చినట్లుగా నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు శుక్రవారం తెల్లవారుజామున వెళుతున్న వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో ఏసీ బస్సు కర్నూలులో అగ్నికి ఆహుతై 19 మంది సజీవ దహనం అయ్యారు. 23 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్ర్భాంతికి గురైంది. అధికారులు అప్రమత్తమై ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్‌లపై తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన.. వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. దీనిపై ఆంధ్రజ్యోతి కథనం..

(భీమవరం క్రైం–ఆంధ్రజ్యోతి):

రోడ్డు రవాణాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రారాజులుగా వర్ధిల్లు తున్నాయి. సౌకర్యవంతమైన వాల్వో ఏసీ, స్లీపర్‌ బస్సు సౌకర్యంతోపాటు తక్కువ సమయంలో గమ్యం చేరుస్తా మని ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. డ్రైవర్లు కొంద రు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. ట్రావెల్స్‌ యజమానుల లా భాపేక్ష ప్రయాణికుల ప్రాణం మీదికి తెస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువ టాక్సుల నేపథ్యంలో వాహనా లు అక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని తర్వాత రాష్ట్రానికి బదిలీ చేసుకుంటున్నారు. వాహన కండిషన్‌, ఇతర నిబం ధనల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు.

శిక్షణ లేదు.. విశ్రాంతి ఉండదు..!

దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రైవేటు బస్సులు నడిపే డ్రైవర్లకు సరైన శిక్షణ లేదు. విశ్రాంతి లేకుండా గంటల తరబడి బస్సు నడపడం తో ప్రమాదాలు చోటు చేసుకుంటు నట్లు అధికారుల అఽధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల ప్రమాదాల సంఘటనలు అనేకం ఉన్నా దగ్ధమైన సంఘటలు జరిగినప్పుడల్లా అధికార యంత్రాం గం అప్రమత్తమై ఒక వైపు ప్రజలను మరో వైపు ట్రావెల్స్‌ వారిని, డ్రైవర్లను జాగృతం చేస్తున్నారు.

హైవే మృత్యుమార్గం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ నంబర్‌ జాతీయ రహదారి (విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు) గుండుగొలను–రాజమండ్రి, హైదరాబాద్‌– రాజమం డ్రి, గుడివాడ–భీమవరం మార్గాల్లో అత్యధికంగా ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ప్రధానంగా విజయవాడ–రాజమండ్రి, హైదరాబాద్‌– రాజమం డ్రి(వయా జంగారెడ్డిగూడెం) మార్గంలో ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఏడాది బస్సు రాకపోకల్లో ఐదు, ఆరు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా మీదుగా వెళుతున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సులపై సరైన తనిఖీలు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతు న్నారు. ప్రైవేటు బస్సులన్నీ రాత్రి వేళ ప్రయాణాలు కొనసాగించడంతో డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం, ఎక్కువ దూర ప్రాంతాల నుంచి బస్సులను నడపడం వల్ల బస్సు ను నియంత్రించే శక్తిని కోల్పోయి ప్రమాదాలు జరుగుతు న్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడెం వరకు డివైడర్‌లేకపోవడంతో ఈ ప్రాంతం లోనూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేటు బస్సుల్లో భద్రతాలోపం భయపెడు తోంది. ట్రావెల్స్‌ బస్సులతోపాటు పాఠశాలలు, కళాశాలల బస్సులు చాలా వాటికి ఫిట్‌నెస్‌ లేకపోవడంతో నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నాయి. జిల్లాలో సుమారు 1200 బస్సులు రోడ్డుపై తిరుగుతున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో ఫిట్‌నెస్‌ లేని వాటిని వదిలిపెట్టడంతో అవి యధావిధిగా తిరుగుతున్నాయి. దీనికితోడు డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. ఇక జిల్లా మీదుగా హైదరాబాద్‌, బెంగళూర్‌, పూణె, చెన్నై, అనంతపూర్‌, ఇటు వైజాగ్‌ రూట్‌లో నిత్యం సుమారు వంద ట్రావెల్స్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు ఐదు వేల మంది ప్రయాణికుల వరకు రాకపోకలు సాగిస్తుంటారు. వారి ప్రాణాలకు రక్షణ కరువైంది. బస్సుల వేగం అరికట్టలేకపోవడం ఒక కారణమైతే.. డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కాలం చెల్లిన బస్సులు కావడం.. మరో కారణం. ఇలాంటి బస్సుల్లో ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఫిట్‌నెస్‌ లేని బస్సులకు రంగులు వేసిలైటింగ్‌ పెట్టి ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బస్సుల ఫిట్‌నెస్‌ను రవాణా శాఖ అధికారులు పరీక్షించాలి. కాని, ఏడాది గడిచినా కొన్ని బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

ఏలూరు రూరల్‌ : కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని రోడ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చక్రాల అమర్‌కుమార్‌, జె.గోపి డిమాండ్‌ చేశారు. ఒడిశాలో 43 సీటింగ్‌ అనుమతి తీసుకొని స్లీపర్‌ కోచ్‌గా మార్చి అక్రమాలకు పాల్పడిన ట్రావెల్స్‌ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ప్రైవేటు ట్రావెల్స్‌ అక్రమాలకు ప్రయాణికులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌ నెస్‌, ఇన్స్యూరెన్స్‌, పొల్యూషన్‌ గడువు ముగిసినా బస్సు నడపడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

946 బస్సులపై కేసులు

ఏలూరు క్రైం : జిల్లాలో ఏ విధమైన ప్రైవేటు ట్రావెల్‌ బస్సులకు రిజిస్ట్రేషన్‌ లేదు. వేరే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని జిల్లాలోని రహదారు లపై తిప్పుతున్నారు. వీటిపై మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్ట ర్లు, సిబ్బంది 24 గంటలు తనిఖీ చేస్తు న్నారు. 23వ తేదీ రాత్రి కలపర్రు టోల్‌గే టు వద్ద 23 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 946 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.59, 44,793 అపరాధ రుసుం విధించాం. రాష్ట్రంలోనే అత్యధికంగా తనిఖీలు చేసిన జిల్లాగా పేరుపొందాం. బస్సుల ఫిట్‌నెస్‌ పరిశీలిస్తున్నాం. వాహన వేగం నియంత్రణకు స్పీడ్‌ గన్నులతో తనిఖీ చేస్తు న్నాం. ప్రమాదాల నియంత్రణకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం.

– షేక్‌ కరీమ్‌, ఏలూరు జిల్లా ఉప రవాణాశాఖాధికారి

Updated Date - Oct 25 , 2025 | 12:52 AM