Share News

మృత్యు చెరువు

ABN , Publish Date - May 15 , 2025 | 12:57 AM

వారంతా బంధువులే. నిత్యం కలిసి మెలిసి పెయిం టింగ్‌ పనులు చేస్తూ సంతోషంగా తమ కుటుంబా లతో జీవిస్తున్నారు. బంధువుల ఇంట్లో జరిగే ఓణీల ఫంక్షన్‌కు అందరూ కలిసి వెళ్దామనుకున్న ఆ ఐదు గురు యువకులు కలిసి మోటారు సైకిళ్లపై బయలు దేరి వెళుతుండగా మార్గమధ్యలో ఒక చెరువు మృత్యు రూపంలో వారిలో ముగ్గురిని మింగేసింది.

మృత్యు చెరువు
సహాయక చర్యల్లో భీమడోలు సీఐ జోసెఫ్‌ విల్సన్‌

ఒకరిని రక్షించబోయి మరో ఇద్దరు..

ప్రాణాలతో బయటపడ్డ మరొకరు

శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం

పెదలింగంపాడు, వేగివాడలో విషాదఛాయలు

ఏలూరు క్రైం/పెదవేగి, మే 14 (ఆంధ్రజ్యోతి) : వారంతా బంధువులే. నిత్యం కలిసి మెలిసి పెయిం టింగ్‌ పనులు చేస్తూ సంతోషంగా తమ కుటుంబా లతో జీవిస్తున్నారు. బంధువుల ఇంట్లో జరిగే ఓణీల ఫంక్షన్‌కు అందరూ కలిసి వెళ్దామనుకున్న ఆ ఐదు గురు యువకులు కలిసి మోటారు సైకిళ్లపై బయలు దేరి వెళుతుండగా మార్గమధ్యలో ఒక చెరువు మృత్యు రూపంలో వారిలో ముగ్గురిని మింగేసింది. మరొకరు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివ రాలివి.. పెదవేగి మండలం వేగివాడకు చెందిన నేతల అజయ్‌ (29), నేతల సాగర్‌ (24), చొక్కా అభిలాష్‌ (19), నున్నా ప్రవీణ్‌ (30), నేతల అనంత హర్ష (16) పెయింటింగ్‌ పనులు చేస్తూ ఉంటారు. భీమడోలు పంచాయతీ పరిధిలోని పెదలింగంపాడులో బంధు వుల ఇంట్లో ఓణీల ఫంక్షన్‌ బుధవారం జరుగుతుండ డంతో వీరంతా మోటారు సైకిల్‌పై ఫంక్షన్‌కు హాజర య్యే నిమిత్తం బయలుదేరి వెళ్తున్నారు. మార్గమధ్యలో భీమడోలు సమీపంలో కోమటికుంట మంచినీటి చెరువు వద్ద అజయ్‌ బహిర్భూమికి వెళ్లగా అతనితో పాటు సాగర్‌ వెళ్లాడు. ఆక్రమంలో అక్కడున్న నాచు కారణంగా తొలుత అజయ్‌ నీళ్లలోకి జారిపోగా అతని కాపాడే ప్రయత్నంలో సాగర్‌ నీళ్లలో పడిపోయాడు. వారిని కాపాడడానికి అభిలాష్‌, ప్రవీణ్‌ నీటిలో దిగి వారు మునిగిపోయారు. గట్టుపై ఉన్న అనంత హర్ష వచ్చి ఇనుప ఊచను అందించగా ప్రవీణ్‌ పట్టుకున్నా డు. కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వారు ప్రవీ ణ్‌ను కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురు నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్‌, ఎస్‌ఐ వై.సుధాకర్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి రిస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిం చారు. హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే బాజీ, ఎస్‌ఐ డ్రైవర్‌ వంశీ, ఆ ప్రాంతానికి చెందిన జనసేన నాయకుడు మదన్‌ ఆధ్వర్యంలో కొంత మంది యువకులు గాలిం పు చేపట్టి ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి బుధవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్ప గించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విషాదంలో బంధువులు

ఈ ప్రమాదంతో అటు పెదలింగంపాడులోని ఇటు పెదవేగి మండలం వేగి వాడలో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. మృతులు ముగ్గురు పేద కుటుంబానికి చెందినవారే. రోజువారీ కూలి పనులతో జీవనం సాగించే ఆ కుటుంబాలు అండగా నిలిచే వ్యక్తులు అందనంత దూరాలకు తరలిపోవడంతో ఆ కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

తమ్ముడి మరణంతో ఒంటరైన అక్క..

మృతులు ముగ్గురిలో ఒకరైన నేతల సాగర్‌ తల్లిదండ్రులు సుందరం, సువర్ణలు 15 ఏళ్ల కిందట మృతిచెందారు. అతనికి ఇద్దరు అక్కలు ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ కుటుంబానికి సొంతిల్లూ లేదు. రోజువారీ కూలి పనులతో ఇద్దరు అక్కలను చదివించిన సాగర్‌.. పెద్ద అక్క స్వరూపకు వివాహం చేశాడు. చిన్న అక్క సుధా రాణి ప్రస్తుతం కళాశాలలో చదువుతోం ది. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నాన్న ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు లేని తనకు అన్నీ తానే తనను కంటికి రెప్పలా కాపాడుకుం టూ వచ్చాడని, ఇప్పుడు తనకెవ్వరు దిక్కని సుధారాణి బోరున విలపించడం చూపరులను కలచివేసింది.

నేతల అజయ్‌కు వివాహం కాగా భార్య ప్రీతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పనికెళ్తేనే కడుపునిండే కుటుంబం కావడంతో అతని భార్య, పిల్లల పరిస్థితిని తలచుకుంటూ గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

చొక్కా అభిలాష్‌ అతని తల్లిదండ్రులు ఇమ్మానియేల్‌, హిమబిందు. వారికి అభిలాష్‌ ఒక్కడే కుమారుడు. అభిలాష్‌కు ఒక అక్క ఉంది. కాయకష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అభిలాష్‌ తల్లిదండ్రులు అందివచ్చిన కొడుకు దూరమవ్వడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. సమీప బంధువులు, ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామం లో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - May 15 , 2025 | 12:58 AM