టిడ్కో ఇళ్లకు డెడ్‌లైన్
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:52 AM
ప్రధానమంత్రి ఆవాస యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఏపీ టిడ్కో ఇళ్లకు డెడ్‌లైన్ విధించారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు
వేగం పెంచనున్న ఏజన్సీ
(భీమవరం–ఆంధ్ర జ్యోతి)
ప్రధానమంత్రి ఆవాస యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఏపీ టిడ్కో ఇళ్లకు డెడ్‌లైన్ విధించారు. రాబోయే మార్చి మాసాంతానికి ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దిశగా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఏజన్సీ కూడా ప్రణాళిక చేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లపై కదలిక వచ్చింది. ఏజన్సీ బకాయిలు చెల్లిస్తోంది. లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో రుణాలు మంజూర య్యేలా చర్యలు తీసుకుంటు న్నారు. ముఖ్యంగా మొదట విడత టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ఇవ్వడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందింది. ప్రతినెలా లక్ష్యాన్ని నిర్దేంచుకుని ఇళ్లు పూర్తిచేయాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నిర్మాణానికి టిడ్కో అధికారులు చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు వాటిని అందజేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీలపై ఉంటుంది. పూర్తయిన ఇళ్లను ఎప్పటి కప్పుడు ఎప్పటికప్పుడు మున్సి పాలిటీలకు టిడ్కో అప్పగించనుంది. ప్రతినెలా కొన్ని ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లాలని టిడ్కోకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పెండింగ్‌లో రుణాలు
టిడ్కో లబ్ధిదారులకు రుణాలు పూర్తి స్థాయిలో ఇంకా మంజూరు చేయలేదు. తొలి విడత టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్న భీమవరం, తాడే పల్లిగూడెం, తణుకులో సుమారు 2 వేల మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. లబ్ధిదారుల నుంచి బ్యాంకులకు రికవరీ మందగించడంతో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు విముఖత చూపుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకపోవడంతో గతంలో మంజూరైన రుణాలకు సంబంధించిన వాయిదాలు చెల్లించడం లేదు. ఇళ్లు స్వాధీనం చేసుకున్న కొందరు లబ్ధిదా రులు కూడా వాయిదాలు చెల్లింపు ప్రారంభించలేదు. బ్యాంకు అధికారులు దీనిపై లబ్ధిదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్లను విస్మరించడంతో ఇప్పుడు అన్ని వర్గాలు ఇబ్బందులు పడు తున్నాయి. తీసుకున్న రికవరీ లేక బ్యాంకులు, ఇళ్లు అప్పగించలేక అధికారులు, వాయిదాలు చెల్లించలేక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. కొత్తగా మంజూరు కావాల్సిన రుణాలపై అధికారులు దృష్టి పెట్టారు. బ్యాం కులను ఒప్పించి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.