Share News

క్యూటెస్ట్‌ వీడియో ఆఫ్‌ ద డే

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:16 AM

చాట్రాయి మండలం పోలవరం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని రాళ్ళబండి శుభశ్రీ రూపొందించిన ‘మెగా పేరెంట్స్‌ డే’ రీల్‌కు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘క్యూటెస్ట్‌ వీడియో ఆఫ్‌ ద డే’ అంటూ కితాబు ఇచ్చి, ఆ వీడియోని డౌన్‌లోడ్‌ చేసుకుని తన సోషల్‌ మీడి యా అకౌంట్‌లో పోస్టు చేశారు.

క్యూటెస్ట్‌ వీడియో ఆఫ్‌ ద డే
భాను శుభశ్రీ

‘మెగా పేరెంట్స్‌ డే’పై

పోలవరం విద్యార్థిని రీల్‌

మంత్రి లోకేశ్‌ మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టు

చాట్రాయి, జూలై 11(ఆంధ్రజ్యోతి): చాట్రాయి మండలం పోలవరం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని రాళ్ళబండి శుభశ్రీ రూపొందించిన ‘మెగా పేరెంట్స్‌ డే’ రీల్‌కు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘క్యూటెస్ట్‌ వీడియో ఆఫ్‌ ద డే’ అంటూ కితాబు ఇచ్చి, ఆ వీడియోని డౌన్‌లోడ్‌ చేసుకుని తన సోషల్‌ మీడి యా అకౌంట్‌లో పోస్టు చేశారు. మర్లపాలెం జడ్పీ హైస్కూల్‌లో కాంట్రాక్ట్‌ డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్న ప్రసాదరాజు, సుకన్య దంపతుల కుమార్తె భానుశుభశ్రీ ‘భాను విలేజ్‌ ఽథాట్స్‌’ పేరుతో రీల్స్‌ చేసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తోంది. పల్లె వాతావరణం, పచ్చటి పంట పొలాలు, అంత రించి పోతున్న పల్లె ఆటలు, స్వచ్ఛమైన గాలి,నీరు, చిన్ననాటి సంగతులు, పల్లె సంస్కృతి సంప్రదాయాలు మొదలైన అంశాలపై రీల్స్‌ చేస్తూ ప్రశంసలు పొం దుతోంది. ఈమెకు 1.76 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండడం విశేషం. కాగా తాను చదివే స్కూల్‌ జరిగిన మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ విశేషాలను వివ రిస్తూ ఆమె రీల్‌ చేసి పోస్టు చేయగా మంత్రి లోకేశ్‌ ప్రశంసించారు.తాను రూపొందించిన రీల్‌ను మంత్రి లోకేశ్‌ మెచ్చుకోవడంతో భాను శుభశ్రీ, ఆమె తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:16 AM