లెక్క తేలింది
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:07 AM
మొంథా తుఫాన్ తీవ్ర నష్టాలనే మిగిల్చింది. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలో వరి, పత్తి, మినుములు, పెసలు, వేరుశనగ, అలసంద పంటలకు నష్టం వాటిల్లింది.
మొంథా తుఫాన్ పంట నష్టం తేల్చిన అధికారులు
5,704.24 హెక్టార్లలో వరి , ఇతర పంటలకు నష్టం
ఇందులో 4,807.37 హెక్టార్లలో వరికి తీవ్ర నష్టం
నేటికీ తేరుకోని వరి పొలాలు
ఏలూరుసిటీ, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): మొంథా తుఫాన్ తీవ్ర నష్టాలనే మిగిల్చింది. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలో వరి, పత్తి, మినుములు, పెసలు, వేరుశనగ, అలసంద పంటలకు నష్టం వాటిల్లింది. వరి చేలు నేలకొరగడంతో చాలా ప్రాంతాల్లో వరి కంకులు మొలకలు రావడం , కుళ్ళిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. మొంథా తుఫాన్ అపరాల పంటలకు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. తుఫాన్ తీరందాటిన తరువాత జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట నష్ట వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రకారం వ్యవసాయ శాఖ, గ్రామాల్లో వ్యవసాయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా పంట నష్టాలను అంచనా వేశారు. ఈ ప్రతి గ్రామం తిరుగుతూ ఈ పంట నష్టాలను ఎన్యూమరేషన్ బృందం అంచనా వేసింది. గురువారం నాటికి వరితోపాటు వేరు శనగ, మినుములు, పెసలు, అలసంద పంటల నష్టాలు తేలాయి.
5,704.24 హెక్టార్లలో పంట నష్టం
జిల్లాలో 5704.24 హెక్టార్లలో వరితో పాటు ఇతర పంటలు నష్టపోయినట్టు జిల్లా వ్యవసాయ శాఖ పంట నష్టాల సర్వే అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రఽధానంగా వరి పంట 4807.37 హెక్టార్లలో నష్టపోగా మినుము 859.21 హెక్టార్లు, పత్తి 33.11 హెక్టార్లు, పెసలు 2.23 హెక్టార్లు, అలసంద 0.70 హెక్టార్లు, వేరుశనగ 1.62 హెక్టార్లు పంట నష్టపోయినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. జిల్లా మొత్తం మీద 25 మండలాల్లో పంట నష్టాలు జరగగా ఇందులో 11,613 మంది రైతులు పంట నష్టపోయారు. ముదినేపల్లి మండలంలో ఎక్కువగా 831. 96 హెక్టార్లలో, పోలవరం 725.80 హెక్టా ర్లు, దెందులూరు 634.40 హెక్టార్లు, ఉంగు టూరు 443.37 హెక్టార్లు, మండవల్లి 400.99 హెక్టార్లు, పెదపాడు 337.44 హెక్టార్లు, భీమడోలు 279.68 హెక్టార్లు, పెదవేగి 264.71 హెక్టార్లు, ఆగిరిపల్లి 260.57 హెక్టార్లు, కొయ్యలగూడెం 238.17 హెక్టార్లు, నూజివీడు 234.01 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం 229.18 హెక్టార్లు, నిడమ ర్రు 229.09 హెక్టార్లు, వేలేరుపాడు 95.69 హెక్టార్లు, చింతలపూడి 84.62 హెక్టార్లు, ద్వారకాతిరుమల 73.36 హెక్టార్లు, ముసు నూరు 71.50 హెక్టార్లలో వరితోపాటు ఇతర పంటలు నష్టపోగా మిగిలిన మండ లాల్లో 50 హెక్టార్ల కంటే తక్కువగానే పంటలు నష్టపోయాయి. పంట నష్టాల ప్రాతిపదికగా రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించే అవకాశాలున్నాయి. ఖరీఫ్‌లో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం కొనుగోలుకు ప్రాఽధాన్యం ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.