పిల్లలను చూద్దామని ఆనందంగా వెళుతూ..
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:47 AM
ఆనందంగా ఉన్న కుటుంబం విధి ఆడిన వింత నాటకంతో ఛిన్నా భిన్న మైంది. ఒకరి అజాగ్రత్త, అతివేగం వల్ల రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపో గా, వారి ముగ్గురు పిల్లలు విగత జీవులుగా ఉన్న తల్లిదండ్రులను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి.. అనాథలైన పిల్లలు
మండవల్లి, డిసెంబరు 24(ఆంధ్ర జ్యోతి): ఆనందంగా ఉన్న కుటుంబం విధి ఆడిన వింత నాటకంతో ఛిన్నా భిన్న మైంది. ఒకరి అజాగ్రత్త, అతివేగం వల్ల రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపో గా, వారి ముగ్గురు పిల్లలు విగత జీవులుగా ఉన్న తల్లిదండ్రులను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు. మండలంలోని కానుకొల్లు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలెపు వెంకన్న(41), గృహలక్ష్మి(37)లకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చేపల పట్టుబడితో జీవనం సాగించే వెంకన్న తన ఇద్దరు కుమార్తెలను విజయవాడ హాస్టల్లో ఉంచి ఒకరిని డిగ్రీ, మరొకరిని ఇంటర్మీ డియట్ చదివిస్తున్నాడు. నెలకోసారి కుమార్తెలను చూడడానికి వెళ్లి వస్తుం టాడు. అలాగే ఈ నెల 21న భార్యతో కలిసి మోటారు సైకిల్‌పై విజయవాడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కుమార్తెలను చూడడానికి వెళ్తుండగా విజయవాడ–కంకిపాడు రోడ్డులో కోమటిలాకుల వద్ద కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. వెంకన్న అక్కడి కక్కడే చనిపోగా, చికిత్స పొందుతూ గృహ లక్ష్మి మంగళవారం కన్ను మూసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భార్యను తీసుకురావడానికి వెళుతూ..
మండవల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పుట్టింటి దగ్గర ఉన్న భార్యని తీసుకురావడానికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందిన ఘటన మండవల్లి మండలం కానుకొల్లు వద్ద జరిగింది. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన మట్టా ఏడుకొండలు(36) తాడేపల్లిగూడెం సమీపంలోని జగన్నాథపురంలో ఉన్న తన భార్యను తీసుకురావడానికి మంగళవారం సాయంత్రం వడాలి నుంచి మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామ పరిధిలోని ఎన్‌హెచ్–165 వద్ద సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అకస్మాత్తుగా ఒక కుక్క అతని మోటార్‌సైకిల్‌కు అడ్డురావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డుపై నడుచు కుంటూ వెళ్తున్న మరో వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏడుకొండలు మోటార్ సైకిల్‌తో సహా కింద పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు 108లో ఏడుకొండలును గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు మండవల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి
మండవల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యో తి): మండలంలోని పెనుమాకలంకలో తల్లీకూతుళ్లిద్దరూ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. ఘంటసాల పార్వతి (60), ఆమె కుమార్తె నాగమణి (40) తమ నివాసంలోనే మృతి చెంది ఉన్నట్లు గ్రామ స్థులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకో లేక మనస్తాపంతో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామ స్థులు చెబుతున్నారు. మృతురాలు పార్వతి మరో కుమార్తె కామాక్షి ఫిర్యాదు మేరకు మండవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి మండవల్లి ఎస్సై సీహెచ్ రామచంద్రరావు చేరుకుని పంచనా మా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టంకు తరలించినట్టు ఎస్సై రామచంద్రరావు తెలిపారు.