Share News

పేదల కోసం పోరాడేది ఎర్ర జెండాయే..

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:12 AM

‘సమస్యల పరిష్కరానికి పోరాడేది, పేదల కోసం పోరాడేది ఎర్ర జెండాయే. దేశాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టులు, లౌకిక పార్టీలు, వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు ఏకం కావాలి..ఈ మేరకు సీపీఐ శత వార్షి కోత్సవాల సందర్భంగా పిలుపు ఇవ్వను న్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ తెలిపారు.

పేదల కోసం పోరాడేది ఎర్ర జెండాయే..
సభలో ప్రసంగిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

దేశాన్ని కాపాడుకోవడానికి అన్ని పక్షాలు ఏకం కావాలి

చింతలపూడి బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

చింతలపూడి, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : ‘సమస్యల పరిష్కరానికి పోరాడేది, పేదల కోసం పోరాడేది ఎర్ర జెండాయే. దేశాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టులు, లౌకిక పార్టీలు, వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు ఏకం కావాలి..ఈ మేరకు సీపీఐ శత వార్షి కోత్సవాల సందర్భంగా పిలుపు ఇవ్వను న్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ తెలిపారు. చింతలపూడిలో శనివారం జరిగిన సీపీఐ జిల్లా బహిరంగ సభలో ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ‘మోదీ మీడియాను చేతుల్లో పెట్టుకుని భారతదేశం ప్రపంచంలో నాల్గవ స్థానానికి ఎదిగిందని ప్రచారం జరుపుకుంటున్నారు. గత జగన్‌ పాలన పిచ్చివాడి చేతిలో రాయిగా సాగింది. ప్రతిపక్షాలకు ఇంటి దగ్గరగాని, కార్యాలయంలో గాని కలిసే అవకాశం ఇవ్వలేదు. ఏ ప్రాజెక్టు కట్టలేదు. బస్సు యాత్ర జరిగినప్పుడు ప్రకాశం జిల్లాలో బండ్లకమ్మ ప్రాజెక్టుకు గేటు ఊడి పోతే పెట్టమన్నా పెట్టలేదు. ఇక ఏడాది చంద్రబాబు పాలనలో ఆయన రివర్స్‌లో ఉన్నారు. ఏడాది ఉత్సవాలు జరుపుకుం టున్నారు.. సమస్యలు యథావిధిగా ఉన్నాయి. ఏడాది పాలనలో లక్ష కోట్లు అప్పు చేశారు. జగన్‌ పాలనలో స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే పగులగొట్టమని ప్రతిపక్ష నేతగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు స్మార్ట్‌ మీటర్‌ బిగిస్తే అభ్యంతరం చెప్పిన వినియోగదారులపై కేసులు పెడుతున్నారు. ఇదేం న్యాయం. పోలవరం పనులను ప్రతీ సోమవారం పర్యవేక్షిస్తామన్న ఆయన ఇప్పుడు ఆ సోమవారం ఏదీ కనిపించడం లేదు. కేంద్రం, రాష్ట్రంలోనూ ఎన్‌డీఏ ప్రభుత్వమేనని, ఇది డబుల్‌ ఇంజన్‌ పార్టీ అని పవన్‌కల్యాణ్‌ చెబుతున్నారు. ఏం అభివృద్ధి జరిగింది. విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నా ఎందుకు ప్రశ్నించరు. వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు, లౌకిక పార్టీలు ఏకమయ్యే రోజు రావాలి. ఇందులో భాగమే ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపు’ అని ఆయన పేర్కొన్నారు. ముందుగా ఆయన పార్టీ కార్యాలయం వద్ద సీపీఐ జెండాను ఎగురవేశారు. సభలో సీపీఐ నాయకుడు మన్నవ కృష్ణచైతన్య, సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యురాలు అక్కి నేని వనజ, డేగా ప్రభాకర్‌, చలసాని రామారావు, బండి వెంకటేశ్వరరావు, ఎం.వసంత రావు, కె.వెంకట్రావు, ఎం.డి.మునీర్‌, ప్రజానాట్య మండలి ఆర్‌.పిచ్చియ్య, హేమశంకర్‌, కంచర్ల గురవయ్య, టి.బాబు తదితరులు పాల్గొన్నారు. సభకు సీపీఐ అభిమానులు భారీగా తరలివచ్చారు. ముందుగా ప్రజానాట్య మండలి పట్టణంలో భారీ ర్యాలీ జరిపింది.

Updated Date - Jul 06 , 2025 | 12:12 AM