Share News

బహుళ పంట విధానం రైతుకు లాభం

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:04 AM

పంటల సాగులో పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా లాభాలను పొందడానికి బహుళ పంటల విధానం ఒక్కటే మార్గమని సీపీసీఆర్‌ఐ మాజీ డైరెక్టర్‌ పి.చౌడప్ప అన్నారు.

బహుళ పంట విధానం రైతుకు లాభం
కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా కోకో సాగును పరిశీలిస్తున్న డాక్టర్‌ చౌడప్ప

సీపీసీఆర్‌ఐ మాజీ డైరెక్టర్‌ చౌడప్ప

పెదవేగి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): పంటల సాగులో పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా లాభాలను పొందడానికి బహుళ పంటల విధానం ఒక్కటే మార్గమని సీపీసీఆర్‌ఐ మాజీ డైరెక్టర్‌ పి.చౌడప్ప అన్నారు. కామవరపుకోట మండలం, పెదవేగి మండలం వంగూరులో కొబ్బరి, పెదవేగిలో ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా కోకో సాగును చౌడప్ప మంగళవారం పరిశీలించారు. సాగులో యాజమాన్య విధానాలు, జాగ్రత్తలను ఆయన రైతులను అడిగి తెలుసుకు న్నారు. చౌడప్ప మాట్లాడుతూ ఎక్కువగా కొబ్బరిలో అంతర పంట గా కోకో సాగు చేస్తున్నారన్నారు. ఆయిల్‌పామ్‌లో కూడా అంతరపంటగా కోకో సాగు లాభసాటి అన్నా రు. అరటిలో కూడా కోకోను సాగుచేసే వీలుందని, ఈ దిశగా రైతులు సాగు చేపట్టవచ్చని ఆయన సూచించారు. ఆధునిక సాం కేతిక అభివృద్ధిని అందుకున్న నేటికాలంలో బహుళ పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. సాగు వ్యయం భారీగా పెరిగిన తరుణంలో బహుళ పంటల సాగు ఒక్కటే రైతులను నిలబెడుతుందని, రైతే ఒక శాస్త్ర వేత్త కావాలని, అప్పుడే నూతన పంటల సాగు మరింతగా విస్తరిస్తుందన్నారు. కోకో పంటలో నాణ్య మైన దిగుబడిని సాధించడానికి మెరుగైన యాజ మాన్య పద్ధతులను పాటించాలని, కోత అనంతరం తీసుకునే నిర్వహణతో గింజ నాణ్యత పెరిగి, మంచి ధర వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏవిధమైన ప్రోత్సాహకాలు అందిస్తే రైతులకు తోడ్పాటుగా ఉంటుందో అనే అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్‌ చౌడప్ప తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖాధికారి ఎస్‌.రామ్మోహన్‌, ఏడీ కె.సం తోష్‌, మండల ఉద్యానశాఖాధికారి ఎం.రత్నమాల, వెంకట్రామన్న గూడెం డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:04 AM