Share News

ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:56 PM

ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ, అభివృద్ధికి అండగా నిలుస్తోంది.

ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

కార్పొరేషన్‌ రుణాల జాడే లేదు!

ఉపాధి యూనిట్ల కోసం నిరీక్షణ

ఉమ్మడి జిల్లాలో 79,625 దరఖాస్తులు

బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్‌..

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు లేవు

ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ, అభివృద్ధికి అండగా నిలుస్తోంది. బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలతో పాటు ఎస్సీ వర్గాల వారి ఆర్థిక సాధికారిత, సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం పలు పథకాల అమలుకు చర్యలు చేపట్టింది. 2024–25 ఆర్థిక సంవత్సరం రుణాల మంజూరుకు గత డిసెంబర్‌ లో దరఖాస్తులను ఆహ్వానించింది. వేగంగా వడపోత చేసినా.. చివరకు యూనిట్ల మంజూరు నిలిచిపోయింది. మూడు నెలలుగా రుణాల మంజూరు ఊసే లేదు. బీసీ,ఈబీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారు రుణాలు మంజూరు చేస్తే యూనిట్ల స్థాపనకు ఎదురుచూస్తున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

బీసీ, ఎస్సీ, కాపు వర్గాల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం ముందుంటుంది. జగన్‌ సర్కార్‌లో ఈ వర్గాలకు రుణాల మాట లేకుండా చేసే శారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసి బీసీ, ఈబీసీ, కాపు, ఎస్పీ కార్పొరేషన్ల ద్వారా యువత ఉపాధి నిమిత్తం యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం నడుం బిగించింది. రుణాల కోసం బీసీ వర్గాలతో పాటు అగ్రకులాల్లో దార్రిద్య రేఖకు దిగువన వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, క్షత్రియ వర్గాల వారు దరఖాస్తు చేసుకున్నారు.

చంద్రన్న స్వయం ఉపాధి పథకంలో బీసీలకు కొన్నిచోట్ల జనరిక్‌ మెడికల్‌ షాపులను కేటాయిం చాలని నిర్ణయించారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వ్యయంతో చిన్న పరిశ్రమల స్థాపనకు అడుగులు వేశారు. దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూ అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేశారు. మండల, పట్ట ణాల్లో యూనిట్ల స్థాపనకు బ్యాంకులకు ఆయా జాబితాలు చేరాయి. యూనిట్లు స్థాపిస్తున్నామ నుకునే తరుణంలో మరింత మందికి ప్రయోజ నం చేకూర్చాలన్న భావనతో ప్రభుత్వం యూని ట్ల మంజూరు నిలిపేసింది. అధికారిక ఉత్తర్వు లు లేకున్నా యఽధాతథ స్థితి కొనసాగించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో లబ్ధిదారుల జాబితా పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి నెల కొంది. యూనిట్ల సంఖ్య పెంచి, ఇప్పుడున్న సబ్సిడీ 30 శాతం నుంచి 50 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోగా, 2025–26 ఆర్ధిక సంవత్సరం యూనిట్లు మం జూరుకు దరఖాస్తులు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారని పలువురు ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి జిల్లాకు 3,802 యూనిట్లు.. దరఖాస్తులు 79 వేలు

ఉమ్మడి జిల్లాకు 3,802 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించారు. మొత్తం 79,625 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం 33,751 మంది రిజిస్ర్టేషన్లు చేయించుకున్నారు. పశ్చిమలో 35,874 మంది దరఖాస్తులను సమర్పించారు. ప్రభుత్వం జిల్లాకు 1,901 చొప్పున యూనిట్లు లక్ష్యంగా కేటాయించడంతో సర్దుబాటు సమస్య గా మారింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా 112, కమ్మ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కింద 729 మంది, క్షత్రియ కార్పొరేషన్‌ ద్వారా 93 మంది, రెడ్డి సంఘం ద్వారా 94, కాపు వెల్ఫేర్‌ కింద 9,392, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ కింద 1057, బీసీ కార్పొరేషన్‌ 21,993 మంది, ఈబీసీ 281 మంది యూనిట్ల మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు. కనీసం జిల్లాకు 3 వేల యూనిట్లు అయినా మంజూరు చేయాల నేది ప్రభుత్వ తాజా నిర్ణయం.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమలు

యూనిట్ల మంజూరు నిలుపుదలపై బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌.పుష్పల తను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. యూనిట్ల మంజూరు ప్రక్రియ నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయన్నారు. మంజూరు ఉత్తర్వుల కోసం చూస్తున్నామన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:56 PM