Share News

ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి : ఎంపీ పుట్టా

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:36 AM

ఆరోగ్యమే మహాభాగ్యం అని పిల్లలు, పెద్దలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ సూచించారు.

ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి : ఎంపీ పుట్టా
ఏలూరులో ఉచిత కార్డియాలజిని ప్రారంభిస్తున్న ఎంపీ పుట్టా, ఎమ్మెల్యే బడేటి

ఏలూరు క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యమే మహాభాగ్యం అని పిల్లలు, పెద్దలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ సూచించారు. విజయవాడ అను కార్డియాక్‌ అండ్‌ న్యూరో హాస్పటల్స్‌ సహకారంతో ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత కార్డియాలజీ, న్యూరాలజీ వైద్య సేవలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో కలిసి శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించు కోవాలన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మరింత మెరుగైన సేవలకు, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లా డుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నానన్నారు. ఎంపీ మహేశ్‌కుమార్‌ యా దవ్‌ ఆసుపత్రికి సీఎస్‌ఆర్‌ నిధుల కింద రూ.కోటి విలువైన ఆపరేషన్‌ థియేటర్‌కు అవసరమైన యంత్ర పరికరాలను అందజేశారన్నారు. ప్రతి శుక్రవారం, మంగళవారం కార్డియాలజీ, న్యూరాలజీ వైద్య సేవల ను ఆసుపత్రిలో వైద్యులు అందిస్తారన్నారు. సమావేశంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు, టీడీపీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, అను ఆసుపత్రి వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:36 AM