Share News

‘స్థానిక’ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:10 AM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని గ్రామాల్లోను అభ్యర్థులను నిలబెడుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు.

‘స్థానిక’ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌
భీమవరంలో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

భీమవరం టౌన్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని గ్రామాల్లోను అభ్యర్థులను నిలబెడుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. భీమవరంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందితో సంతకాల సేకరణ లక్ష్యమని ఒక్కొక్క నియోజకవర్గంలో 20 వేల సంతకాలు సేకరిస్తున్నామన్నారు. బీజేపీ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కిందని విమర్శించారు. పాలక్‌ వర్మ, మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు, కేబీఆర్‌ నాయుడు, డీసీసీ అధ్యకుడు పాతపాటి హరికుమార్‌రాజు మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి మావుళ్లమ్మ ఆలయం వరకు ర్యాలీగా సంతకాల సేకరణ చేపట్టారు. బైపూడి నాగేశ్వరావు, సోడాదాసి లూథర్‌ మార్టిన్‌, రాజ్‌కుమార్‌, సీతారామ్‌, మార్నీడి బాబ్జి హరికిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:10 AM