Share News

కమిటీలేవి సామీ!

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:15 AM

సొసైటీల్లో త్రిసభ్య కమిటీల నియామకంలో అడుగు పడింది. మరోవైపు జిల్లాలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు పూర్తిగా భర్తీకాలేదు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆలయ కమిటీలకు మోక్షం ఏదీ అనేది అందరి ప్రశ్న. జిల్లావ్యాప్తంగా పేరొందిన ఆలయాలకు చైర్మన్‌, సభ్యుల పేర్లను సిఫార్సు చేసినా ఎమ్మెల్యేలు మరికొన్ని ఆలయాల జాబితాలను ఇప్పటికీ రూపొందించలేకపోయారు.

కమిటీలేవి సామీ!

జిల్లాలో నోటిఫై చేసింది 73 ఆలయాలు

కమిటీలకు సిఫార్సు చేసింది 43

ఆశావహులు ఎక్కువ మంది..!

కొన్నిచోట్ల కూటమిలో కుదరని సయోధ్య

మరికొన్ని చోట్ల ఎంపికలో తీవ్ర జాప్యం

కేడర్‌లో ఆగ్రహం, అసంతృప్తి

సొసైటీల్లో త్రిసభ్య కమిటీల నియామకంలో అడుగు పడింది. మరోవైపు జిల్లాలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు పూర్తిగా భర్తీకాలేదు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆలయ కమిటీలకు మోక్షం ఏదీ అనేది అందరి ప్రశ్న. జిల్లావ్యాప్తంగా పేరొందిన ఆలయాలకు చైర్మన్‌, సభ్యుల పేర్లను సిఫార్సు చేసినా ఎమ్మెల్యేలు మరికొన్ని ఆలయాల జాబితాలను ఇప్పటికీ రూపొందించలేకపోయారు. ఏడాది గడిచినా స్పష్టత లేదు. స్థానికంగా సర్దుబాటు చేయలేక జాప్యం తప్పడం లేదు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. రెండు, మూడు నెలలుగా నామినేటేడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. వరుసగా నియోజకవర్గాల వారీగా నామినేటేడ్‌ పద వుల ఆశించిన వారి సంఖ్య డజన్లలోనే ఉంది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టించి పనిచేసిన వారు, వైసీపీ ఆగడాలను తట్టుకొని ధైర్యంగా నిలబడిన వారు, ఆది నుంచి పార్టీనే నమ్ముకున్న సీనియర్లను ఎమ్మెల్యేలు గుర్తించి ఆలయ కమిటీలకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా నామినేటేడ్‌ పదవుల భర్తీలో వేగంగా వ్యవహరించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో జాప్యం కొనసా గడంపై అసంతృప్తి నెలకొంది. జిల్లాలో పేరొందిన మద్ది ఆంజ నేయస్వామి, పట్టిసీమ వీరేశ్వర దేవస్థానం, కొల్లేటి కోట పెద్దిం టమ్మ, రాట్నాలమ్మ, అప్పనవీడు అభయాంజనేయస్వామి, ఏలూరు ఆర్‌ఆర్‌పేట వేంకటేశ్వరస్వామి వంటి ఆలయాలకు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇప్పటికే సిఫార్సులు చేశారు. పార్టీకి పూర్తిగా అంకింతం కావడమే కాకుండా హిందూ సంప్రదాయా లకు కట్టుబడి ఉన్న వారిని ఆలయ కమిటీలకు ఎంపిక చేస్తా రు. పార్టీల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన వారికి ఆయా కమిటీల్లో స్థానం కోసం పోటీ నెలకొంది.

ఏ పార్టీకి కేటాయించాలి..?

జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి కమిటీ చైర్మన్‌ పదవి టీడీపీకి కేటాయించాలా.. జనసేనకు ఇవ్వాలా అనే విషయమై తర్జనభర్జనలు సాగుతున్నాయి. మార్కెట్‌ కమిటీ ఏ పార్టీకి కేటాయిస్తే మరో పార్టీకి మద్ది ఆలయం కమిటి వదిలి వేయాలని స్థానిక నేతలు పట్టుబడుతున్నారు. జనసేన పక్షాన సీతారాం ఈ పదవిని ఆశిస్తుండగా, తెలుగుదేశం నేతలు రాజా న పండు, చిక్కాల ఆంజనేయులు కూడా గట్టి పట్టుబడుతు న్నారు. గోకుల పారిజాత గిరి కమిటీ చైర్మన్‌ కోసం బీజేపీ తొంగి చూస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి పూర్తిగా సంతృప్తి పడితేగానీ ఆలయ కమిటీలు ఒక గాడిన పడే అవకాశాల్లేవు. మొదటి నుంచీ మద్ది చైర్మన్‌ కోసం వైసీపీ హయాంలో కూడా తీవ్ర పోటీ తలెత్తింది. అప్పట్లో కూడా ఆచితూచి వైసీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. పట్టిసీమ దేవస్ధానం చైర్మన్‌గా వెంకట జగన్నాథరావు మరోమారు చైర్మన్‌ గా వ్యవహరించే అవకాశం ఉంది. గడిచిన నాలుగేళ్లగా జగన్నా థరావు పట్టిసీమ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాట్నాలమ్మ ఆలయ కమిటికి రాయనపాలెంకు చెందిన మన్నె శ్రీనివాస్‌ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. కొల్లేరు పెద్దింటమ్మ ఆలయ చైర్మన్‌ ఎవరు అని టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. కానీ కొల్లేటి కోటకు చెందిన జల్లూరి వెంకన్న ఈ పదవికి నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎందుకీ జాప్యం?

జిల్లావ్యాప్తంగా 89 పైగా ఆలయాలుండగా 73 దేవాలయాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో కేవలం 43 ఆలయ కమిటీలకు మాత్రమే ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు. మిగతా 30పైగా ఆలయ కమిటీలకు సిఫార్సులు లేదా ప్రతిపాదన దేవదాయ శాఖకు అందనేలేదు. వాస్తవానికి ఆది నుంచి పార్టీ కోసం నిత్యం పరిశ్రమించిన వారు లేకపోలేదు. పార్టీపై అభిమానంతో సొంత ఖర్చులను భరించి, అసలు పనులను వదిలేసి ఫుల్‌టైమర్లగా వ్యవహరిస్తున్న వారు లెక్కకు మిక్కిలి ఉన్నారు. ఎమ్మెల్యేలు మాత్రం నామినేటేడ్‌ పదవుల భర్తీలో ముందడగు వేయలేకపోతున్నారు. కేవలం క్యాడర్‌లో సీనియర్లు, జూనియర్లుగా విభజన, సామాజిక వర్గాల వారీగా పోటీ తీవ్రంగా ఉండడంతో ఏడాది నుంచి ఎటూ తేల్చలేకపోయారు. ఆలయ కమిటీల్లో చైర్మన్‌, సభ్యులుగా నియమితులైతే కేవలం గౌరవ ప్రతిష్టలతోనే ఒక సేవగా భావించి ఆలయాల అభివృద్దికి కష్టపడతారు. సాధ్యమైనంత వరకు సీనియర్లే ఈ పదవులను ఆశిస్తారు. సామాజికపరంగా ఈసారి తమ వారికే అవకాశం ఇవ్వాలని చాలా ఆలయాల పరిధిలో నేతలు పట్టుబడుతున్నారు. కనీసం వారి మధ్య స్నేహ పూర్వక వాతావరణం మఽధ్యే సయోధ్య సాధించి ఆ మేరకే ఆలయ కమిటీలను సిఫార్సు చేసి ఉండాల్సింది. స్థానిక ఎమ్మెల్యేకు కొంత మేర సిఫార్సుల ఒత్తిడి ఉండేది. ఇప్పుడు కనీసం సిఫార్సు చేయడంలో జాప్యంతో క్యాడర్‌లో అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తోంది. ఆలయ కమిటీ లను ఆగస్టులో భర్తీ చేస్తారని, ఆలోపు జాబితాలను మరోసారి పరి శీలించడం, రాని వాటిని రప్పించుకోవడం జరుగుతుం దని ఇంకొందరు భావిస్తున్నారు. ఆలయ కమిటీలపై ఎమ్మెల్యేలు దృష్టిపెడితే కొందరికైనా నామినేటెడ్‌ పదవులు దక్కుతాయి.

Updated Date - Jul 15 , 2025 | 12:15 AM