Share News

ఆక్రమణలు తొలగిస్తాం

ABN , Publish Date - May 19 , 2025 | 12:30 AM

గొల్లలకోడేరు యనమదుర్రు డ్రెయిన్‌ గట్టుపై ఉన్న ఆక్రమిత స్థలాల ను కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదివారం పరిశీలించారు.

ఆక్రమణలు తొలగిస్తాం
ఆక్రమిత భూములను పరిశీలిస్తున్న కలెక్టర్‌

గొల్లలకోడేరులో భూములు పరిశీలించిన కలెక్టర్‌ నాగరాణి

పాలకోడేరు, మే 18(ఆంధ్రజ్యోతి): గొల్లలకోడేరు యనమదుర్రు డ్రెయిన్‌ గట్టుపై ఉన్న ఆక్రమిత స్థలాల ను కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించి త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. గొల్లలకోడేరు గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఖాళీ భూమలును పరిశీలించి ఎవరైనా ఆ భూములను ఆక్రమిస్తే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు చేపడతామని నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. గొల్లలకోడేరులో సీసీ రోడ్డుపై రోడ్డు వేయడంతో పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రహదారిని పరిశీలించిన అనంతరమే బిల్లులను ఆమోదించాలన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదని తెలిపారు. ఆమె వెంట ఆర్డీవో ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎన్‌.భారతి విజయలక్ష్మి, ఎంపీడీవో వి.రెడ్డయ్య, కొత్తపల్లి నాగరాజు, ఇరిగేషన్‌ డీఈ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:30 AM