Share News

టిడ్కో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చెయ్యండి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:48 AM

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణా లను త్వరితంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చెయ్యండి
మునిసిపల్‌ కమిషనర్లు, టిడ్కో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

భీమవరంటౌన్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణా లను త్వరితంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణా ల ప్రగతిపై కమిషనర్లతో కలెక్టర్‌, జేసీ మంగళవారం సమీక్షించారు. నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఇళ్లు లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఫేజ్‌–1 ఫేజ్‌–2 కింద 21,424 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 8,832 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందని, 640 ఇళ్ల మంజూరు రద్దు కాగా ఇంకా 11,952 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉందన్నారు. సమావేశంలో టిడ్కో ఈఈ నారాయణరావు, మునిసిపల్‌ కమిషనర్లు కె.రామచంద్రారెడ్డి, ఎం.ఏసుబాబు, టి.రామ్‌కుమార్‌, బి.విజయ సారథి పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్‌కు దళారులను ఆశ్రయించవద్దు : జేసీ

భీమవరం టౌన్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూములు, ఇళ్లు తదితర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు దళారులను ఆశ్రయించవద్దని జేసీ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి సూచించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై గునుపూడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మంగళవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ద్వారా అందించే సేవలు, ఏవిధంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనే అంశాలు వివరించారు.

గ్యాస్‌.. డెలివరీ చార్జీలపై కఠిన చర్యలు

వినియోగదారులకు ఇంటి వద్దకు గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా డెలివరీ చేయాలని, గ్యాస్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా చర్యలు తప్పవని జేసీ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. దీపం పథకంలో లబ్ధిదా రులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ అమలుపై పౌరసరఫరాల అధికారులు గ్యాస్‌ డీలర్లతో మంగళవారం ఆయన సమీక్షించారు. గ్యాస్‌ సరఫరాలో పారదర్శకత, వినియోగదారుల సంతృప్తిని పెంచే లక్ష్యంతో ఏజెన్సీలు పనిచే యాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎన్‌.సరోజ, ఏఎస్‌వో ఎం.రవిశంకర్‌, జిల్లాలోని గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు, పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:49 AM