గిరిజనుల అభివృద్ధికి ఉత్కర్ష అభియాన్
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:03 AM
జిల్లాలో దర్తీ అభాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ గిరిజనుల అభ్యున్నతికి దోహదపడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.

ఏలూరు, జూన్ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దర్తీ అభాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ గిరిజనుల అభ్యున్నతికి దోహదపడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై అవగాహన కలిగించేందుకు ఈ నెల 16 నుంచి 30 వరకు గిరిజన గ్రామాల్లో అవ గాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సామాజిక, మౌలిక సదుపయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధిలో కీలకమైన అంతరాలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం అమలు లక్ష్యమన్నా రు. సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాములు నాయక్, గిరిజన సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.