Share News

వృద్ధుల ఇంటి వద్దకే రేషన్‌

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:22 AM

వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారి ఇంటి వద్దకే రేషన్‌ అందించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి రేషన్‌ డీలర్లను ఆదేశించారు.

వృద్ధుల ఇంటి వద్దకే రేషన్‌
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ వెట్రి సెల్వి

ఏలూరు టూటౌన్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారి ఇంటి వద్దకే రేషన్‌ అందించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి రేషన్‌ డీలర్లను ఆదేశించారు. నగరంలో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల ఇళ్లకు వెళ్లి రేషన్‌ పంపిణీపై ఆరా తీశారు.

బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను, చట్టప రమైన అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అన్నారు. జిల్లాకలెక్టరేట్‌లో కార్మికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి

ఏలూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఉద్యానవన సం బంధిత పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కలిగించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. పీఎం విశ్వకర్మ పఽథకం ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలో దరఖాస్తు చేసిన 32 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో 51 మంది పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ సమావేశం ఆమోదం తెలిపింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న జిల్లా వ్యాప్తంగా 4.5లక్షల మొక్కలు నాటనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి మొక్కలు నాటే కార్యక్రమంపై మంగళవారం ఆమె సమీక్షించారు. జిల్లాలో ఇళ్ల ప్రగతికి నిర్థేశించిన లక్ష్యాలను సాధించే దిశగా హౌసింగ్‌ అధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి సూచించారు. కలెక్టరేట్‌ నుంచి ఇళ్ల ప్రగతిపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - Jun 04 , 2025 | 12:22 AM