సకాలంలో రీ సర్వే పూర్తి చేయండి
ABN , Publish Date - May 29 , 2025 | 12:23 AM
జిల్లాలో పైలెట్ ప్రా జెక్టుగా చేపట్టిన భూముల రీసర్వే పక్రియను నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఏలూరు, మే 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పైలెట్ ప్రా జెక్టుగా చేపట్టిన భూముల రీసర్వే పక్రియను నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవె న్యూ అంశాలపై ఆమె సమీక్షించారు. సీసీఎల్ ఆదేశాల మేరకు నీటి తీరువా వసూళ్లను వేగవంతం చేయాల న్నారు. జూన్ 1 నుంచి రేషన్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకోవాలని, విభిన్న ప్రతిభావంతులు, 65 ఏళ్ల పైబడి న వారికి ఇంటి వద్దనే రేషన్ అందించాలన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలించాలి
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్ర మాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడా రు. జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియో గ నివారణ దినోత్సవం సంద ర్భంగా జూన్ 1 నుంచి 26 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అన్న క్యాంటీన్ల పరిశీలన
అన్న క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించాల ని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. నగరంలో ఇండోర్ స్టేడి యం వద్ద అన్న క్యాంటిన్‌ను బుధవారం రాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రుచి, నాణ్యత పరిశీలించారు.
యెగాసనాలపై అవగాహన
యోగాంధ్ర కార్యక్రమంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గురువారం ద్వారకాతిరుమలలో యోగాసనాల ప్రాము ఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జూన్ 5న పోలవరం, 11న గురవాయిగూడెం, 10న గుంటుపల్లి బౌద్దరామాలు వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.