Share News

పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:19 AM

జిల్లాలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌, వాట్సాప్‌ గవర్నెన్స్‌ ప్రక్రియ వేగవం తంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ నాగరాణి అన్నారు.

పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్‌
బధిరుల పాఠశాల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగరాణి

మవరంటౌన్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి):జిల్లాలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌, వాట్సాప్‌ గవర్నెన్స్‌ ప్రక్రియ వేగవం తంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి బుధవారం వర్క్‌ఫ్రంహోం, ఈకేవైసీ, తల్లికి వందనం, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీసీలో ఆమె సమీక్షించారు. తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల బ్యాంకు ఖాతాలో ఇంకా కొంతమందికి పలు కారణాల దృష్ట్యా నగదు జమకాకపోవడంపై ఉన్న సమస్య పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఆక్వాజోన్‌ విస్తీర్ణంపై నివేదికలు ఇవ్వండి..

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్‌ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి రెండు రోజుల్లోపు జిల్లాస్థాయి కమిటీకి నివేదికను అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని ఈనెల 17న ఏర్పాటు చేయాలని జిల్లా మత్స్య శాఖ అధికారికి సూచించారు.

జూ గుర్రపు డెక్క నుంచి వర్మీ కంపోస్ట్‌ తయారీ, ఎస్‌జీహెచ్‌సీ మహిళల ఉపాధి అంశంపై అధికారులతో ఆమె సమీక్షించారు. ప్రతి మండలంలో గుర్రపు డెక్క నుంచి వర్మీ కంపోస్ట్‌ తయారీకి మూడు యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్మీ కంపోస్టు తయారీ వల్ల యూరియా వినియోగం తగ్గుతుందన్నారు. ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖల కన్వర్జెన్సీతో డీఆర్‌డీఏ సమన్వయం చేసుకుంటూ పెద్దఎత్తున గుర్రపు డెక్క వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

‘బధిరులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి’

భీమవరంటౌన్‌ : బధిరులు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడేందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలో శ్రీరామకృష్ణ సభ భవన్‌లో వేంకటేశ్వర బధిర పాఠశాల 35వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ బధిర పాఠశాలను 1985లో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ ప్రారంభించారన్నారు. 150మంది వరకు విద్యార్థులు చదువుకునే వారని, నేడు 75 మంది మాత్రమే చదువుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో బధిర వె ౖకల్యం కలిగిన వారిని గుర్తించి ఈ పాఠశాలలో చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. తొలుత బధిర విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనకు ఆమె ముగ్ధులై విద్యార్థులను అభినందించారు. బధిర పాఠశాల మాజీ సభ్యులు పేరిచర్ల లక్ష్మణవర్మ, డీఎన్‌ఆర్‌ కళాశాల అధ్యక్షుడు జి.వి నరసింహరాజు, కరస్పాండెంట్‌ గాదిరాజు సత్యనారాయణరాజు, గన్నాబత్తుల తులసమ్మ, పెదతాత ట్రస్టు అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్‌, చెరుకువాడ రంగసాయి, ప్రిన్సిపాల్‌ ఎ.తిరుపతిరావు, ఎ.లక్ష్మీనారాయణ, ట్రాన్స్‌ లేటర్‌ కె.రాజు కె.రాజు, జి.శ్రీనివాసరాజు, ప్రెసిడెంట్‌ ఎస్‌.శ్రీనివాస్‌ వర్మ పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 12:19 AM