Share News

రక్షిత నీరందించాలి

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:39 AM

:కాలు వల నుంచి నీరు విడుదల కావడంతో జిల్లాలో కుళా యిల ద్వారా రక్షిత నీరందించడానికి చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ నాగరాణి అధికారులకు సూచించారు. తాగునీరు, పన్ను వసూలు, శానిటేషన్‌, అనుమతులు లేని లే అవుట్లలో నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

రక్షిత నీరందించాలి

ఆన్‌లైన్‌ ద్వారా పన్ను వసూళ్లు

అనుమతి లేని లేఅవుట్లలో నిర్మాణాలకు నో

కలెక్టర్‌ చదలవాడ నాగరాణి

భీమవరం రూరల్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి):కాలు వల నుంచి నీరు విడుదల కావడంతో జిల్లాలో కుళా యిల ద్వారా రక్షిత నీరందించడానికి చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ నాగరాణి అధికారులకు సూచించారు. తాగునీరు, పన్ను వసూలు, శానిటేషన్‌, అనుమతులు లేని లే అవుట్లలో నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆన్‌లైన్‌ ద్వారా పన్ను వసూళ్లను సత్వరమే ప్రారంభించాలన్నారు. జిల్లాలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా అనధికార లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి డీపీవో వై.దోసిరెడ్డి, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, డీఎల్‌పీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:39 AM