ఓటర్ల నమోదు సక్రమంగా ఉండాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:13 AM
ఓటరు నమోదు, మార్పులు, చేర్పు లు సక్రమంగా పూర్తి చేయాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు.
భీమవరంటౌన్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఓటరు నమోదు, మార్పులు, చేర్పు లు సక్రమంగా పూర్తి చేయాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో గురు వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓటర్ల నమోదు, మా ర్పులపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. గత ఆరు నెలల డేటా పరిశీలించి డబుల్ ఎంట్రీలు ఉంటే చర్యలు తీసుకుం టామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓట ర్లు 14,70,866 మంది కాగా పురుషులు 7,20,613 మంది, మహిళలు 7,50,197 మంది, ట్రాన్స్‌జెండర్స్ 77 మంది ఉన్నార న్నారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.