Share News

జిల్లాలో ఆదాయ వనరులపై దృష్టి సారిస్తాం

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:58 PM

జిల్లాలో ఆదాయవనరులపై మరింత దృష్టి పెడ తాం.. పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు చేపట్టామ ని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు.

జిల్లాలో ఆదాయ వనరులపై దృష్టి సారిస్తాం

కలెక్టర్ల సదస్సులో వెట్రిసెల్వి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఆదాయవనరులపై మరింత దృష్టి పెడ తాం.. పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు చేపట్టామ ని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. కలెక్టర్ల సదస్సులో రెండోరోజు స్వచ్ఛ భారత్‌, స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర, పరిశ్రమల స్థాపన, కాలుష్య నియంత్రణతో పాటు శాంతిభద్రతలపై సమీ క్షించారు. ప్రధానంగా పీ–4 కార్యక్రమం విజయవంతం చేయడానికి తీసుకుంటున్నట్లు వెట్రిసెల్వి వివరించారు. కలెక్టరేట్‌, వివిధ ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రం గా ఉంచడంలో అధికారులు తమ కార్యాలయం నుంచే అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏలూరు జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా రూపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను రీ సైక్లింగ్‌ చేయడానికి ప్లాస్టిక్‌ స్లటర్‌ యంత్రాలను నియోజకవర్గానికి ఒక యూనిట్‌ను అం దించాలన్నారు. అటువంటి యూనిట్లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని కలెక్టర్‌ కోరారు. కొబ్బరి వ్యర్థాల పునర్విని యోగం యూనిట్ల ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలన్నా రు. ఏలూరు జిల్లాలో మైనింగ్‌ ఆదాయంలో వెనకబడి ఉండడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ వసూళ్లతోపాటు ప్రభుత్వ వచ్చే ఆదాయ వనరులపై తరచూ సమీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. జిల్లాలో అటవీశాఖపరంగా మరింత గ్రీనరీ పెంచాల్సిన అంశంపైన సీఎం దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి జిల్లాలో ఏడు శాతం గ్రీనరీ పెంచడానికి తీసుకోవాల్సిన అన్ని అంశాలపై అధికారులతో సమీక్షించి తగు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వితో జిల్లా ఎస్పీ కె ప్రతాప్‌ కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:58 PM