Share News

సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు ?

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:32 AM

సెల్‌ఫోన్‌ చూస్తున్నారా, సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు అని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ప్రశ్నించారు. శుక్ర వారం తణుకు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులతో మమేకమ య్యారు.

సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు ?
తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగరాణి

విద్యార్థులకు కలెక్టర్‌ ప్రశ్న

తణుకు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):సెల్‌ఫోన్‌ చూస్తున్నారా, సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు అని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ప్రశ్నించారు. శుక్ర వారం తణుకు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులతో మమేకమ య్యారు. కలెక్టర్‌ విద్యార్థులతో మాట్లాడుతూ మీలో చాగంటి కోటేశ్వరరావు రచించిన విలువల విద్య పాఠాలు ఎంతమంది చూశారు అని ప్రశ్నించారు. సెల్‌ఫోన్‌ కొద్ది సమయం చూడటం తప్పులేదని విజ్ఞానాన్ని పెంచుకునే విష యాలను తెలుసుకోవడానికి మాత్రమే దానిని వినియోగించుకోవాలన్నారు. తప్పుగా ఉండే వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షితులు కాకూడదని, అవి మీ జీవి తాన్ని అగాఽథంలోకి నెట్టేస్తాయన్నారు. విద్యతోనే భవిష్యత్‌ ఉంటుందని అన్నా రు. పది తర్వాత ఏ కోర్సులు చేయవచ్చో ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలి యజేయాలని చెప్పారు. ఐటిఐ, పాలిటెక్నిక్‌, నర్సింగ్‌ వంటి కోర్సులు జీవితంలో త్వరగా స్థిరపడటానికి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇటీవల సైన్సు ఫెయిర్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాధికను జిల్లా కలెక్టర్‌ అభినందించారు. మెగా పేరెంట్స్‌ టీచర్సు డేకి తప్పకుండా మీ తల్లిదండ్రులు తీసుకురాలని సూచించారు. విద్యార్థుల అసెస్మెంట్‌ బుక్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో కౌసర్‌ బానో, డీఈవో నారాయణ, ఎంఈవో ఆంజనేయులు, హెచ్‌ఎం పద్మావతి, తహసీల్దార్‌ అశోక్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:32 AM