Share News

సారొస్తున్నారు..!

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:45 AM

సీఎం చంద్రబాబు డిసెంబరు 1న ఉంగుటూరు నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

సారొస్తున్నారు..!
హెలీపాడ్‌ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని ఆంజనేయులు

రేపు సీఎం చంద్రబాబు పర్యటన

శరవేగంగా ఏర్పాట్లు.. పటిష్ఠ భద్రత..ఉంగుటూరులోనే యంత్రాంగమంతా మకాం

ఏర్పాట్లను పరిశీలించిన ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

ఏలూరు/తాడేపల్లిగూడెం/నిడమర్రు,నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు డిసెంబరు 1న ఉంగుటూరు నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అధికారులకు అందిన సమాచారం ప్రకారం గోపీనాథపట్నంలో తొలుత సీఎం పెన్షన్ల పం పిణీలో పాల్గొంటారు. దీనికోసం నలుగురు లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. వారితో సీఎం ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం గొల్లగూడెం వద్ద ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. ఇక్కడ పొలాలను సభావేదికగా అనువుగా తీర్చిదిద్దుతున్నారు. పొలాలను చదును చేసి, గ్రావెల్‌ పోసి సిద్ధంగా చేస్తున్నారు. పది వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రవేశద్వారాలు, వీఐపీలు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్క డ పొరపాట్లకు తావివ్వకుండా తొక్కిసలాట లు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్పీలు పర్యవేక్షించారు. అక్కడే నియోజకవర్గంలో పీ–4 కింద బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న దాతలతో ముఖాముఖిగా సమావేశం కానున్నారు. భో జన విరామం తర్వాత నియోజకవర్గ టీడీపీ నాయకులతో పార్టీ సమావేశం నిర్వహించ నున్నారు.

సీఎం పర్యటనను విజయవంతం చేయండి : గన్ని, పత్సమట్ల

ఉంగుటూరు నియోజకవర్గంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను కార్యకర్తలు నాయకులు విజయవంతం చే యాలని ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజ నేయులు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కోరారు. ఈ మేరకు హెలీప్యాడ్‌ స్థలాన్ని శనివారం అధికారులతో కలిసి పరిశీలిం చా రు. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీ, ప్రజా వేదికలో ద్వారా ప్రజలతో బహిరంగ సమా వేశం, పీ4లో మార్గదర్శకుల గుర్తింపు, కేడర్‌ మీటింగ్‌, భద్రతా చర్యలు, తదితర అంశాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాకకోసం ఉంగుటూరు నియోజకవర్గ ప్రజ లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని, ఆయ న రాక ఉంగుటూరు అభివృద్ధికి మరోక కీలక మైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మండల పార్టీ అఽఽధ్యక్షుడు వేముల సుధీర్‌, చింతల వాసు, కడియాల రవి శంక ర్‌, నల్లా ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం మీటింగ్‌కు ట్రాఫిక్‌ నియంత్రణ

డిసెంబరు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపఽథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చేబ్రోలు రైల్వే గేటు నుంచి దూబచర్ల, దూబచర్ల నుంచి చేబ్రోలు మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు, గూడ్స్‌ వెహికల్స్‌ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంది. సాధారణ పౌరులు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు యథావిధిగా కొనసాగుతాయని నిడమర్రు సీఐ రజనీకుమార్‌, చేబ్రోలు ఎస్‌ఐ ఎం. సూర్య భగవాన్‌ తెలిపారు.

మూడు రోజుల నుంచి మకాం

జిల్లా అధికారులతో పాటు జేసీ అభిషేక్‌ గౌడ, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ మూడు రోజుల నుంచి సభాస్థలి, సీఎం పర్యటించే ప్రాంతాల వద్ద మకాం వేశారు. వివిధ శాఖల వారీగా బాధ్య తలను కలెక్టర్‌ అప్పగించారు. చాలా కాలం తర్వాత ప్రజలతో దగ్గరగా సీఎం చంద్రబా బు సభ ఉండడంతో పటిష్ఠ నిఘా, ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు.

రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు

ముఖ్యమంత్రి పర్యటన వల్ల రోడ్లకు మోక్షం కలుగు తోంది. చేబ్రో లు–దూబచర్ల, నారాయణ పురం–గణప వరం రోడ్లలో గోతులను యుద్ధప్రాతి పదికన రోడ్లు భవనాలు శాఖ అధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు.

సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌

ఉదయం 10.30 : ఉండవల్లిలో నివాసం నుంచి బయలుదేరుతారు.

10.55 : ఉంగుటూరు మండలం గొల్ల గూడెం హెలీపాడ్‌కు చేరుకుంటారు.

10.55 – 11.10 : ప్రజాప్రతినిధులు, అధికారులు రిసీవింగ్‌

11.10 – 11.20 : హెలీప్యాడ్‌ నుంచి గోపీనాఽథపట్నంకు రోడ్డుమార్గంలో ప్రయాణం

11.20 – 11.40 : గోపీనాఽథపట్నంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీ

11.40 – 11.50 : గోపీనాఽథపట్నం నుంచి గొల్లగూడెంకు రోడ్డుమార్గంలో పయనం

11.50 – 11.55 : గొల్లగూడెం స్ధబాప్రాంగణం వద్ద ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ సందర్శన

11.55 – 1.25 : గొల్లగూడెం వద్ద ప్రజావేదిక సభ

1.25 – 2.00 : రిజర్వుడు సమయం

2.05 – 3.35 : ముఖ్య కార్యకర్తలతో సమావేశం

3.35 : హెలికాప్టర్‌లో ఉండవల్లికి ప్రయాణం

Updated Date - Nov 30 , 2025 | 12:45 AM