Share News

కూటమి నేతల సన్నాహక సమావేశం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:29 AM

డిసెంబరు ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల నిమిత్తం ఉంగు టూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కూటమి నేతలు సన్నాహాక సమావేశం నిర్వహించారు.

 కూటమి నేతల సన్నాహక సమావేశం
సీఎం చంద్రబాబు సభాస్థలి ప్రాంగణంను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ధర్మరాజు, గన్ని, ఆర్డీవో తదితరులు

నిడమర్రు నవంబరు 27(ఆంధ్రజ్యోతి):డిసెంబరు ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల నిమిత్తం ఉంగు టూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కూటమి నేతలు సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, బీజేపీ కన్వీనర్‌ శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కూటమి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జనసమీకరణ, రూట్‌ మ్యాప్‌, సభ వద్ద ప్రజలకు సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడా నికి గ్రామ, మండలస్థాయిల వారీగా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని మాట్లాడుతూ సీఎం పర్యటనలో భాగంగా హెలీప్యాడ్‌ , రైతన్న మీకోసం, గొల్లగూడెంలో ఎంపిక చేసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీపై రేపటి లోగా స్పష్టత వస్తుందన్నారు. బీజేపీ కన్వీనర్‌ శరణాల మాలతీరాణి మాట్లాడు తూ సీఎం పర్యటన ఉంగుటూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. కూటమి నేతలు ముత్యాలస్వామి, తోట శ్రీను, నిమ్మల దొరబాబు, పి.రాంబాబు,జ్యోతి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా సీఎం సభాస్థలి ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు, గన్ని, ఆర్డీవో, డీఎస్పీ పరిశీలించారు.

సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష

ఏలూరు,నవంబరు 27(ఆంధ్రజ్యోతి): డిసెం బరు ఒకటిన ఉంగుటూరు మండలంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధి కారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీ క్షించారు. మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సీఎం సామాజిక పెన్షన్ల పంపిణీ, బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు. అనం తరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. గొల్లగూడెం, గోపీనాథపట్నంల్లో సీఎం పాల్గొనే కార్యక్రమాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాల న్నారు. హెలీప్యాడ్‌, సభాస్థలి ప్రాంతాలను అధికారులు పరిశీలించి ప్రతిపాదనలను సమర్పించాల న్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, జడ్పీ సీఈవో శ్రీహరి, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:29 AM