నేనున్నానని..
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:04 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో సోమవారం నిర్వహించిన పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది.
బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా
సీఎం టూర్ సూపర్ సక్సెస్
ఉంగుటూరుకు వరాల జల్లు
రోడ్లు, కాలేజీ భవనాలు నిర్మిస్తాం
త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతలు పూర్తి చేస్తాం
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు కల్పిస్తాం
సమస్యలపై సీఎంకు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని నివేదన
ఉంగుటూరులో ఉత్సాహంగా సాగిన సీఎం చంద్రబాబు పర్యటన
ఏలూరు/ఉంగుటూరు/నిడమర్రు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో సోమవారం నిర్వహించిన పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. పర్యటన ఆసాంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. ఆయనను చూసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పొలం గట్ల మధ్య నుంచి పరు గులు పెట్టి వచ్చారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయ లుదేరిన ఆయన ఉదయం 11.40 గంటలకు నల్లమాడు చేరుకున్నారు. అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గోపీనాథపట్నం వెళ్లి అక్కడ కిడ్నీ బాధితురాలు నాగలక్ష్మికి పింఛన్ అందజేసి కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రజా వేదిక వద్ద తనను కలిసిన బాధి తులకు నేనున్నానని అభయం ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు కష్టపడి పనిచేసే వారిని తాను చూసుకుం టానని హామీ ఇచ్చారు. ప్రజా వేదిక వద్ద వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాల్స్‌ను పరిశీలించారు. వివిధ రకాల వస్తువులు, పంటలు ఉత్పత్తి చేసిన వారితో మాట్లా డి.. వారిని ప్రోత్సహించేలా అధికారులకు సూచనలు ఇచ్చా రు. పీ–4 కింద ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను మార్గదర్శకులు ఆదుకుని వారిని ఉన్నత స్థానంలో నిలపా లని కోరారు. ‘పంచసూత్రాల ఆఽధారంగా రైతులు వ్యవసా యాన్ని లాభసాటిగా మార్చుకోవాలి. దీనిపై ప్రతీ రైతుకు అవగాహన కల్పిస్తున్నాం. పెరటి కోళ్ల పెంపకం ద్వారా డ్వాక్రా మహిళలు ఇంటి వద్దే ఆదాయం సంపాదించేందుకు మార్గాలు వేస్తున్నాం. పామాయిల్ పంటను ప్రోత్సహిస్తాం. ఏలూరు జిల్లాలోను పరిశ్రమలు రావాలి. పారిశ్రామికవేత్తల కు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తాం’ అంటూ జిల్లా పురోభి వృద్ధికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. సభా వేదిక వద్ద చిన్నారులతో ముచ్చటించారు. అలాగే సీఎం ఉంగుటూ రుకు వరాల జల్లు కురిపించారు. నల్లజర్ల రోడ్డు విస్తరణ, ఇంటర్ కాలేజీ భవనాలు, గురుకుల పాఠశాల భవనాల నిర్మాణంతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పూర్తికి చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నల్లమాడులో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు ఇతర పనులను పూర్తి చేయడానికి కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
హార్టికల్చర్ అసిస్టెంట్‌కు చంద్రబాబు క్లాస్
నల్లమాడులో ఇళ్లు, ఇతర వివరాలను ప్రకటించిన హార్టి కల్చర్ అసిస్టెంట్ ప్రేమ్‌కుమార్‌కు చంద్రబాబు క్లాస్ తీసు కున్నారు. పంటల సాగు వివరాలు, టాయిలెట్లు, ఇళ్ల తది తర వివరాలపై పొంతన లేని లెక్కలు చెప్పడంపై ఏం ప్రిపేర్ అయ్యి వచ్చావా అంటూ ప్రశ్నించారు. పామాయిల్ సాగు విస్తీర్ణంలో ఉత్పాదకత పెంచడానికి ఏం చర్యలు తీసుకున్నావని అడగ్గా నీళ్లు నమిలారు. ఒక ప్రణాళిక ప్రకారం పంటల సాగులో రైతులను ముందుకు నడపించాలి. మళ్లీ వస్తా.. అప్పటికే రైతులకు పంటలపై తగు సలహాలు, సూచనలు ఇచ్చి సంసిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటులో జిల్లా ఐదో స్థానంలో ఉందని, మూడో స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.
సీఎం పర్యటనలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి, జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ,ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బడేటి చంటి, మద్దిపాటి వెంకట్రాజు, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్‌కుమార్, చిర్రి బాలరాజు, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మురళీ, ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ కిశోర్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, జెడ్పీ సీఈవో శ్రీహరి, సీపీవో వాసుదేవరావు పాల్గొన్నారు.
ఐదు గంటలపాటు వడివడిగా
సీఎం చంద్రబాబు ఐదు గంటలపాటు ఉంగుటూరు మండలంలో పర్యటించారు.
ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన ఉదయం 11.40 గంటలకు నల్లమాడు చేరుకున్నారు. అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
రోడ్డు మార్గాన గోపీనాథపట్నం వెళ్లి అక్కడ కిడ్నీ బాధితురాలు నాగలక్ష్మికి పింఛన్ పంపిణీ చేసి తిరిగి నల్లమాడులోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను 25 నిమిషాలపాటు ఆసక్తిగా తిలకించారు. వివరాలు అడి గి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రజావేదిక పైకి వచ్చి గంటా పది నిమిషాలపాటు ప్రసంగించారు.
అనంతరం ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు.
సాయంత్రం 4.50 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లికి బయలుదేరారు.
సీఎం సభలో పనిచేయని మైక్‌లు
నిడమర్రు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి):సీఎం సభలో మైకులు సరిగా పనిచేయకపోవడంతో కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమాడు ప్రజావేదిక మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టర్ ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమైంది. మైక్ సరిగా పనిచేయక ఆమె మాటలు ఎవరికి సరిగా వినిపించలేదు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతున్న సమయంలో కార్ట్ లెస్ మైక్ పనిచేయకపోవడంతో ఆయన అసహనానికి గురయ్యారు. దీంతో వైరు మైక్‌తో మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత మాట్లాడిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుకు ఇదే పరిస్థితి ఎదురవడంతో ఇబ్బందిపడ్డారు. వెంటనే కలెక్టర్ వెట్రిసెల్వి వేగంగా స్టేజి దిగి మైక్ సెట్టింగ్ పాయింట్ వద్దకు వచ్చి సంబంధిత అధికారిపై మండిపడ్డారు. ఇదేమిటని నిలదీశారు. తక్షణం మైక్ సరిచేయాలని ఆదేశించడంతో ఐదు నిమిషాల్లో సమస్య పరిష్కారమైంది. తర్వాత కార్ట్ లెస్ మైక్‌లు పనిచేయడంతో సీఎం సభకు ఎలాంటి ఆటంకం కలగలేదు.
చింతలపూడి పూర్తి చేయాలి
చంద్రబాబు విజన్‌తో రాష్ర్టా భివృద్ధికి పూనుకున్నారు. స్వర్ణాంధ్ర ఆయనతోనే సాధ్యం. చింతలపూడి ఎత్తిపోతల పఽథకా న్ని పూర్తి చేయడంతోపాటు, ఏలూరు–జంగారెడ్డిగూడెం రోడ్డు జాతీయ రహదారిగా ప్రకటించి, ఏలూరులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
మా సమస్యలు తీర్చండి
నియోజకవర్గంలో రూ.140 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టాం. నల్లజర్ల– లక్ష్మీపురం రోడ్డును మంజూరుచేయాలి. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు నియోజకవ ర్గాన్ని అనుసంధానం చేయాలి. నారాయణపురం ఇంటర్ కాలేజీ, పొలసానిపల్లి గురుకుల పాఠశాల భవనాలు నిర్మించాలి. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. గణపవరం మండల బీసీ బాలికల హాస్టల్ నిర్మాణం మంజూరు చేయాలి.
– ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
పామాయిల్ రైతులను ఆదుకోవాలి
రూ.2 కోట్లు మంజూరు చేస్తే గొల్లగూడెంలో రోడ్లు బాగుపడ తాయి. పామాయిల్ తోటల్లో విద్యుత్ తీగలు చెట్లకు తగిలి రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారు. విద్యుత్ లైన్లు మార్చుకోవడానికి చార్జీల కింద అధికారులు 25 శాతం కట్టమంటున్నారు. దాన్ని తగ్గిస్తే రైతులు లైన్లు వే సుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
– ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
కూటమి కార్యకర్తలతో గొడవలొద్దు
‘కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అండగా నేనున్నా. పార్టీ ఉంటుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రజలకు చేరువగా ఉన్నప్పుడే వారు మనల్ని గుర్తిస్తారు. కార్యకర్తల సంక్షేమమే నా లక్ష్యం. అందరూ కష్టపడి 2029 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచే యాలి’ అంటూ సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. నల్లమాడులో సోమవారం 900 మంది ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘పార్టీ సుస్థిరత కోసం ఉంగు టూరు నియోజకవర్గంలో గన్ని వీరాంజనేయులు కృషి అమోఘంగా ఉంది. పార్టీ కేడర్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని త్వరలోనే సరిచేస్తాం. కూటమి పార్టీ కార్యకర్తలతో సఖ్యంగా ఉండాలి. మనం వాళ్లని కలుపుకుని వెళ్లాలి. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభి స్తుంది. గొడవలు పడవద్దు. కలసిమెలసి పనిచేయాలి. ఒక్కసారి నెగ్గడం కాదు.. రాష్ట్ర అభివృద్ధికి మన ప్రభుత్వం మళ్లీ రావాలి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కంచుకోట.. కార్యకర్తలు అలగవద్దు’ అంటూ ఆయన సుతిమెత్తగా హెచ్చరించారు. మారిశెట్టి ప్రసాద్, ముత్యాల స్వామి, సత్తినీడి నాని, పొత్తూరి నరసింహరాజు, రుద్రరాజు కొండయ్య, గఫ్పార్‌ఖాన్, వేముల పల్లి సుధీర్, కడియాల రవిశంకర్, పాతూరి విజయకుమార్ తదితరులు పాల్గోన్నారు.