ఒకటిన సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:07 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబరు 1న జిల్లా పర్య టనకు రానున్నారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ,
రైతన్నా – మీ కోసం ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నం
ఏలూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబరు 1న జిల్లా పర్య టనకు రానున్నారు. ప్రతీ నెలా పేద, బడుగు వర్గాల పెన్షన్ల పంపిణీలో సీఎం ఏదో ఒక జిల్లాలో పాల్గొంటు న్నారు. ఈసారి ఏలూరు జిల్లా రానున్నట్టు సమాచారం. దీంతో ఆయన పర్యటనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు, నారాయణపురం గ్రామాల్లో ఏదో ఒకచోట ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతన్నా – మీ కోసం కార్యక్రమం ఈ నియోజకవర్గంలోనే నిర్వహించనున్నారు. అదే రోజు పార్టీ పరిస్థితులపై నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు పర్యటనపై ఈనెల 26న ఏలూరులో జరిగే జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సీఎం చంద్రబాబు పోలవరంలో రెండుసార్లు పర్యటించారు. అనంతరం ఈ ఏడాదిలో ఫిబ్రవరి 11న పీ–4 కార్యక్రమాన్ని నూజివీడులోని ఆగిరిపల్లిలో ప్రారంభిం చారు. తాజా పర్యటన నాలుగోది కానుంది.