Share News

ప్రభుత్వ విధానాలపై పశ్చిమ ప్రజల్లో సంతృప్తి

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:32 AM

కూటమి ప్రభుత్వ విధానాలపై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో సంతృప్తి స్థాయి అధికంగానే నమోదైంది.

ప్రభుత్వ విధానాలపై పశ్చిమ ప్రజల్లో సంతృప్తి
సీఎం సదస్సులో ఎస్పీ నయీం అస్మి, కలెక్టర్‌ నాగరాణి

ఉచిత ఇసుక విధానం భేష్‌.. పన్నుల వసూళ్లలోనూ ముందంజ

స్వమిత్వ సర్వేలో కాస్త వెనుకబాటు.. జిఎస్‌టి వసూళ్లలో వృద్ధి

మత్స్యకారులకు మరింత సహకారం కావాలన్న కలెక్టర్‌ నాగరాణి

అమరావతిలో సీఎంతో ముగిసిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు

‘కూటమి ప్రభుత్వ విధానాలపై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో సంతృప్తి స్థాయి అధికంగానే నమోదైంది. ఉచిత ఇసుక విధా నాన్ని జనం మెచ్చుకుంటు న్నారు. జిల్లాలో ఇసుక ర్యాంపులు తెరవకపోయినా తూర్పు గోదావరి నుంచి దిగుమతి చేస్తున్నారు. వైసీపీ హయాంలో రూ.14 వేలకు లభ్యమైన ఇసుక ఇప్పుడు రూ.10 వేలకు చేరుకుంటోంది. అదీ ఆరు యూనిట్లు. ఇది ఒక్కటే కాదు.. అనేక అంశాల్లో జిల్లాలో 74 శాతం మంది సంతృప్తితో ఉన్నట్టు తేలింది’ ఇదీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో గురు వారం విడుదల చేసిన పశ్చిమ గోదావరి నివేదికలోని సారాంశం.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం సూచించిన పారిశ్రమిక రంగం మినహా మిగిలిన అన్ని రంగా ల్లోనూ పశ్చిమ తన ప్రాధాన్యతను కాపాడుకుంది. పరిశ్రమలతో ఒప్పం దాల్లోనే కాస్త వెనుకపడింది. ఇతర జి ల్లాలకంటే అట్టడుగున ఉంది. భూము ల లభ్యత లేకపోవడంతో కొత్త పరిశ్ర మల స్థాపనకు ఒక్కరూ ముందుకు రాలేదు. ఇప్పటి వరకు మూడు కంపె నీలతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. అది తక్కువ పెట్టుబడితోనే సరిపెటు ్టకోవాల్సి వచ్చింది. ఇతర రంగాల్లో మా త్రం వృద్ధి కనబరిచింది.

16,116 బంగారు కుటుంబాలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కున్న బంగారు కుటుంబాల విష యంలో జిల్లాలో 16,116 కుటుంబా లను గుర్తించారు. మార్గదర్శులను ంపిక చేయడంలో అధికార యంత్రాంగం కాస్త మెరుగైన పనితీరునే కనబర్చింది.

యువతకు ఉద్యోగాలు

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 49 జాబ్‌మేళాలను నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు 42 పూర్తి చేశారు. మరో ఏడు నిర్వహించాల్సి ఉంది. ప్రతి మేళాలోనూ యు వతకు సగటున 100 ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలే ప్లేస్‌మెంట్స్‌ కోసం వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంకేవై, పీఎం విశ్వకర్మ పథకాల్లో 7456 మందికి రుణాలు మంజూరు చేశారు. స్వయం ఉపాధి కల్పించారు.

పన్నుల వసూళ్లలో ముందంజ

పంచాయతీల పన్నుల వసూళ్లలో ఇతర జిల్లాలతో పోలిస్తే మూడో స్థానంలో నిలచింది. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని పంచాయతీల నుంచి రూ.36.37 కోట్లు వసూలు చేయాలి. రూ.7.38 కోట్లు మాత్రమే వసూలు చేశారు. జీఎస్టీ వసూళ్ల లోనూ జిల్లా వృద్ధి రేటు గణనీ యంగా పెరిగింది. గత ఏడాది రూ.240 కోట్లు వసూలు చేశారు. ఈ ఏడాది రూ.292 కోట్లకు చేరింది.

స్వమిత్వ సర్వే

స్వమిత్వ సర్వేలో జిల్లా అధికారులు లక్ష్యాలను అధికంగా పెట్టుకున్నా రు. మొదటి దశలోనే 197 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి 48 గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. దీని వల్ల పంచాయతీల్లోని నివాసాలు, ఇళ్ల స్థలాలు అన్ని వెబ్‌ల్యాండ్‌లో కనిపిస్తాయి. సరిహద్దులతో సహా యజమాని పేరు ఉంటుంది. దీనివల్ల ఇంటి యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్రమంగా రిజిస్ర్టేషన్‌లు చేసుకునే విధానానికి చెక్‌ పడనుంది. సర్వే గ్రామాలు అధికంగా ఎంపిక చేసు కోవడంతో పూర్తి చేసే జిల్లాల పరంగా జిల్లా వెనుకపడింది. అదే ఇతర జిల్లాల్లో 100లోపు గ్రామా లను ఎంపిక చేసుకున్నారు. దాని వల్ల సర్వే పూర్తిచేసిన గ్రామాల శాతం అధికంగా ఉంది.

యూనిట్‌ వ్యయం తగ్గించండి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మత్స్యకారులకు అంది స్తున్న యూనిట్‌ వ్యయాన్ని తగ్గిం చాలంటూ సదస్సులో కలెక్టర్‌ నాగ రాణి కోరారు. బోటుతోపాటు, 150 కేజీల వల, 5 హెచ్‌పి మోటార్‌ను రూ.5 లక్షలకు ఇస్తున్నారు. బోటు యూనిట్‌ రూ.3 లక్షలలోపే ఉంటే అధిక మంది తీసుకుంటారని సీఎం దృష్టికి కలెక్టర్‌ తీసుకువెళ్లారు.

పలు అంశాల్లో ముందంజ

ఎరువుల లభ్యతలో రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆర్‌వోఆర్‌ సర్వే, మహిళలపై నేరాల కట్టడిలోను ముందంజలో నిలిచింది.

విద్యుత్‌ సేవలు, మారక ద్రవ్యాల నియంత్రణ, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ, ప్రజా వైద్యం అందించడంలో జిల్లాకు రెండో స్థానం దక్కింది.

ఆర్టీసీ బస్సులు, దీపం పథకం 2.0 అమలు, పారిశుధ్య నిర్వహణలో జిల్లా మూడో స్థానంలో నిలిచి మంచి గుర్తింపునే దక్కించుకుంది.

కాలుష్య నియంత్రణలో మాత్రం వెనుకపడింది. బస్‌ స్టేషన్‌లు, అన్నాక్యాంటీన్‌ల నిర్వహణలో విత్తనాలు పంపిణీలో 8 నుంచి 13 ర్యాంకుల మధ్యలో పశ్చిమ తన స్థానం నిలుపుకొంది.

Updated Date - Dec 19 , 2025 | 12:32 AM