1న సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:17 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంగుటూరు నియోజకవర్గ పర్యటన ఖరారైంది.
సభా స్థలిని పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి
నిడమర్రు నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంగుటూరు నియోజకవర్గ పర్యటన ఖరారైంది. డిసెంబరు 1న పెన్షన్ల పంపిణీ, సభ ఏర్పాట్లపై అధికారం యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టరు వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గోపినాఽథపట్నం, చేబ్రోలు, గొల్లగూడెంలో సభ ఏర్పాట్లుకు మంగళవారం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ మూడు ప్రాంతాలలో అనువైన చోట సభాస్థలి ఏర్పాటుకు ఉన్నతాధికారులకు కలెక్టరు నివేదించారు. గొల్లగూడెంలో ప్రజలతో ముఖాముఖి, బహిరంగ సభ, కార్యకర్తలతో సమావేశం, హెలిపాడ్ ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపడుతున్నారు. దీనితోపాటు గొల్లగూడెం లేదా చేబ్రోలు గ్రామాలలో సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడ, డీఎస్పీ శ్రావణకుమార్, ఆర్డీవో అంబరీష్, కూటమి నేతలు పాల్గొన్నారు.