ప్రగతి బాటలో పశ్చిమ
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:06 AM
‘పశ్చిమ గోదావరి జిల్లా ప్రగతిబాటలో పయనిస్తోంది. వ్యవ సాయం, మత్స్య సంపదలో కీలకంగా వ్యవహరిస్తోంది.
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు
రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో కీలక పాత్ర.. సంక్షేమం, అభివృద్ధిపై అడుగులు
వ్యవసాయం, మత్స్య సంపదలో ముందడుగు.. రైల్వే, రవాణాలోనూ వృద్ధి
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
‘పశ్చిమ గోదావరి జిల్లా ప్రగతిబాటలో పయనిస్తోంది. వ్యవ సాయం, మత్స్య సంపదలో కీలకంగా వ్యవహరిస్తోంది. పారిశ్రామికంగా అవకాశాలు తక్కువగా ఉన్నా ప్రోసెసింగ్ యూనిట్లు, ఇతర ఉత్పత్తుల్లో కాస్త మెరుగ్గా ఉంది’ ఇదీ అమరావతిలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో ముఖ్య మంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేసిన నివేదికలోని సారాంశం. పశ్చిమ పురోగతికి తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి డాక్యుమెంట్ సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కలెక్టర్‌లకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొబ్బరి, ఆక్వా ఉత్ప త్తులకు పెట్టింది పేరు. అధిక ఆదాయం సమకూర్చే ఈ రంగా లను మరింత వృద్ధి చేయాలి. అలాగే మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చిన నిధులను జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.
పారిశ్రామికంగా జిల్లాలో భూముల కొరత ఉన్నా రైస్ మిల్లింగ్, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లాలో విస్తారంగా ఉన్నాయి. ఆక్వాలోనే రొయ్య వ్యర్థాలతో ప్రోటీన్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను ఇటీవల నెలకొల్పారు. మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన 12 ఎకరాల భూమిని అన్వేషిస్తున్నారు. మొత్తంగా జిల్లా స్థూల జాతీయ ఉత్పత్తిలో పశ్చిమ 8వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రూ.34,048 కోట్ల స్థూల ఉత్పత్తిని సాధించింది. వాస్తవానికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా కు రూ.78,303 కోట్ల స్థూల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టారు. సెప్టెంబరు వరకు రెండు క్వార్టర్ల లెక్కలను తీస్తే జిల్లా రూ.34,048 కోట్ల ఉత్పత్తిని సాధించింది. లక్ష్యాలను అత్య ధికంగా సాధించిన జిల్లాలో పశ్చిమ 43.48 శాతం లక్ష్యాన్ని చేరుకుని నాలుగో స్థానంలో నిలిచింది. కృష్ణా, అనకాపల్లి, శ్రీకా కుళం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రధానం గా వరి, మత్స్య సంపదలో జిల్లా ఉత్పత్తి గణనీయంగా ఉంది. ఆ తర్వాత పరిశ్రమలు, గుడ్ల ఉత్పత్తిలోనూ జిల్లా సముచిత స్థానంలో ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన హౌసింగ్, ఫైనాన్స్, ఉపాధి, ఎనర్జీ రంగంలో మౌలిక వసతులు, రెవెన్యూ సంక్షే మం, మున్సిపల్ పరిపాలన, పర్యావరణ, అడవులు, ఐటీ, ప్లానింగ్, పెట్టుబడులు, ఉన్నత విద్య, జల వనరులు, సెకండరీ ఎడ్యుకేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, రవాణా, రహదారులు వంటి 30 అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మార్కులు ఇచ్చింది. అందులో పశ్చిమ గోదావరి 287 పాయింట్లు సాధించి 13వ స్థానంలో నిలచింది.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో..
రైల్వే, రవాణా, వాణిజ్యం, హోటల్స్. కమ్యూనికేషన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ జిల్లా ప్రగతి కనబరిచింది. ఈ ఏడాది రూ. 26,236 కోట్ల స్థూల విలువను సాధించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. రెండు క్వార్టర్లలో రూ.11,490 స్థూల విలువను సాధిం చింది. పారిశ్రామికంగా జిల్లాలో రూ.11,520 కోట్ల వృద్ధి సాధిం చాలని లక్ష్యంగా పెట్టుకుంటే 4,547 వృద్ధి(జీవీఏ) సాధించగలి గారు. సుస్థిర ప్రగతిలో జిలా 53 పాయింట్లు సాధించింది. ఆక్వా అభివృద్ధిలో రూ.23.,644 కోట్ల జీవీఏ సాధించాల్సి ఉండ గా సెప్టెంబరు వరకు రూ.11,592 కోట్లు సాధించి ముందంజ లో ఉంది. మత్స్య, పాడి అభివృద్ధిలో 74 పాయింట్‌లు సాధించి బి గ్రేడ్‌లో నిలిచింది. వ్యవసాయంలో 80 పాయింట్‌లు సాధించి ఎ గ్రేడ్‌ను కైవసం చేసుకుంది.