Share News

15న సీఎం చంద్రబాబు తణుకు పర్యటన

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:07 AM

ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్ర మంలో ఈనెల 15న తణుకు పర్యటించనున్నారు.

15న సీఎం చంద్రబాబు తణుకు పర్యటన
తణుకు జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో సభ ఏర్పాట్లపై కలెక్టర్‌, ఎస్పీ పరిశీలన

తణుకు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్ర మంలో ఈనెల 15న తణుకు పర్యటించనున్నారు. పాలిటె క్నిక్‌ కళాశాల ఆడిటో రియంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధు లతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొం టారు. అనంతరం జడ్పీ స్కూలు ఆవరణలో జరి గే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన స్టాల్స్‌ సంద ర్శిస్తారు. ప్రజా వేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తారు. స్టాల్‌, ప్రజా వేదిక కార్యక్రమ స్థలాలను సీఎం కార్యాలయ సెక్యూరిటీ విభా గం పరిశీలన అనంతరం ఖరారు చేస్తారు.

ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష

సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో మంగళ వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని మునిసిపల్‌ కమిషనర్‌ రామ్‌కు మార్‌ను ఆదేశించారు. బారికేడింగ్‌ ప్రాంతాలు, హెలీప్యా డ్‌ ఏర్పాటు, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికా రులకు సూచనలు ఇచ్చారు. భోజన ఏర్పాట్లను డీఎస్‌వో, డీఎం పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో సభా ప్రాంగణంలో తాగు నీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

హెలీప్యాడ్‌ స్థలాల పరిశీలన

సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు ఏర్పాటుకు పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణను కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ అద్నాన్‌ నయూం ఆస్మీ పరిశీలించారు. జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో పార్కింగ్‌ కోసం పరిశీలించారు. జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఏఎస్పీ. బి.భీమారావు, ఆర్డీవోలు కతీబ్‌ కౌసర్‌ బానో, దాసి రాజు, డీఎస్పీ విశ్వనాథ్‌, కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌, తహసీల్దార్‌ డీవీవీ ఎస్‌ అశోక్‌వర్మ, పాలిటెక్నిక్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ ఎన్‌.తులసీరాధ, టి.మారుతీరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 01:07 AM