Share News

ముగిసిన సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడా ఎంపికలు

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:58 PM

సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఏలూరు జిల్లా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బుధవారం ఉత్సాహంగా ముగిశాయి.

ముగిసిన సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడా ఎంపికలు
యోగాకు ఎంపికైన సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు

ఏలూరు రూరల్‌/ తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి) : సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఏలూరు జిల్లా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బుధవారం ఉత్సాహంగా ముగిశాయి. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎస్‌ఏ అజీజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక కార్యక్రమాన్ని క్రీడాభివృద్ధి శాఖ కోచ్‌లు పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పర్యవేక్షించారు. రెండో రోజు క్రికెట్‌, యోగా, డ్యాన్స్‌ విభాగాలలో ఉద్యోగులు 20 మంది పాల్గొనగా 15 మందిని ఎంపిక చేసినట్లు అజీజ్‌ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల ఆవరణలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో ముగ్గురు ఉపాధ్యాయులు రాషస్థాయి పోటీలకు ఎంపికైనట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్‌. మోహన్‌దాస్‌ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్‌, ఆరవల్లి ఉన్నత పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయిని చల్లా హేమలత, చెరుకువాడ జడ్పీ పాఠశాల హిందీ టీచర్‌ సీహెచ్‌ రమాదేవి ఎంపికయ్యారు. ఎంపికైన వారు ఈనెల 19 నుంచి 22 వరకు ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా పోటీల్లో పాల్గొంటారు.

ఏలూరు జిల్లాలో ఎంపికైన ఉద్యోగులు ..

క్రికెట్‌ : పవన్‌ శ్రీనివాస్‌రెడ్డి, బి.నవీన్‌సూర్య, కె.రాజేష్‌, ఎం.కృష్ణారావు, ఎ.సునీల్‌బాబు, ఎం.డి.మొహిషీన్‌, వీఎన్‌డీవీ ప్రసాద్‌, జె.సత్యనారాయణ, డి.రవికుమార్‌, జి.సతీష్‌కుమార్‌, షేక్‌ రియాజ్‌, డి.వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు.

యోగా : మొనగంటి మహీంద్రాచార్యులు, ఇరప అమ్మాజి.

డ్యాన్స్‌ : పాయం రత్నకుమారి ఎంపికయ్యారు.

Updated Date - Nov 12 , 2025 | 11:58 PM