ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
ABN , Publish Date - May 10 , 2025 | 12:35 AM
దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అంతమొందించేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోదీ సంకల్పానికి అందరం భగవంతుడిని ప్రార్థించాలని త్రిదండి చిన శ్రీమన్నా రాయణ రామానుజ జీయరు స్వామి అన్నారు.
మోదీ సంకల్పానికి అండగా భగవంతుడిని ప్రార్థించాలి
చిన జీయర్ స్వామి
ఏలూరు కార్పొరేషన్, మే 9 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అంతమొందించేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోదీ సంకల్పానికి అందరం భగవంతుడిని ప్రార్థించాలని త్రిదండి చిన శ్రీమన్నా రాయణ రామానుజ జీయరు స్వామి అన్నారు. ఆర్‌ఆర్ పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ఠ, మహాకుంబాభిషేక మహోత్సవం సంద ర్భంగా శుక్రవారం ఆయన సందర్శించారు. దేశం కోసం పోరాడుతున్న జవానులకు మనోధైర్యాన్ని కలుగ చేసేం దుకు అందరం సమష్టి కృషి చేద్దామన్నారు. మతం అడిగి హతమారుస్తున్న ఉగ్రవాదులను అంతమొందిం చాల్సిన అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉందన్నా రు. సమాజంలో అసమానతలు తొలగాలని, అంతా సమతాభావం ఉండాలన్నదే రామానుజాచార్యుల ఆశ యమన్నారు. సమాజ శ్రేయస్సు కోసం దేశభక్తితో పౌరులంతా ఏకాగ్రతతో ఉండాలన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి, ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు, ప్రజాప్రతినిధులు, కార్పొ రేటర్లు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సమస్త సృష్టిలో భగవత్ స్వరూపం
ద్వారకాతిరుమల: సమస్త సృష్టిలో భగవత్ స్వరూ పం నిండి ఉందని చిన జీయర్ స్వామి అన్నారు. ద్వారకాతిరుమల విర్డ్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయనకు శ్రీవారి ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తి తదితరులు స్వాగతం పలికారు. ఆసుపత్రి ఆవ రణలో స్వామి వారికి పూజలు చేసి భక్తులకు ఆయన అనుగ్రహభాషణ చేశారు.