Share News

6న లఘు చలన చిత్ర పోటీలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:31 AM

జాతీయ తెలుగు సార స్వత పరిషత్‌ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు ఈనెల 6న నిర్వహిస్తున్నట్టు పరిషత్‌ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్‌ తెలిపారు.

6న లఘు చలన చిత్ర పోటీలు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న హరిరామజోగయ్య, శ్రీనివాస్‌

పాలకొల్లులో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

పోటీలకు 12, ప్రత్యేక జ్యూరీకి 6 చిత్రాలు ఎంపిక

పాలకొల్లు అర్బన్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జాతీయ తెలుగు సార స్వత పరిషత్‌ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు ఈనెల 6న నిర్వహిస్తున్నట్టు పరిషత్‌ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్‌ తెలిపారు. సంస్థ ముఖ్య సలహాదారు చేగొండి వెంకట హరిరామ జోగయ్య నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నామని, పోటీలకు 90 లఘు చిత్రాలు రాగా 12 చిత్రాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. మరో 6 లఘు చిత్రాలను ప్రత్యేక జ్యూరి ప్రద ర్శనకు ఎంపిక చేశామన్నారు. ప్రథమ స్థానం పొందిన చిత్రానికి రూ.లక్ష, ద్వితీయ చిత్రానికి రూ.75వేలు, తృతీయ చిత్రానికి రూ.50వేలు నగదు బహుమతి, మిగిలిన 9 చిత్రాలకు రూ.5వేలు చొప్పన షీల్డ్‌, ప్రశంసాపత్రం, ప్రత్యేక జ్యూరి ప్రదర్శనకు ఎంపికైన వాటికి షీల్డ్‌, ప్రశంసాపత్రం అంద జేయడం జరుగుతుందన్నారు. హరిరామ జోగయ్య మాట్లాడుతూ పోటీలను మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటి స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభిస్తారన్నారు. పాలకొల్లు కేంద్రంగా ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలన్నదే తమ ధ్యేయం అన్నారు. ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌పిఎన్‌ వర్మ మాట్లాడుతూ పోటీలకు న్యాయ నిర్ణేత లుగా దర్శకులు రేలంగి నరసింహారావు, వీరశంకర్‌, వీఎన్‌ ఆదిత్య, బీవీఎస్‌ రవి, సిరాశ్రీ, రాజా వన్నెంరెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. కాగా పోటీల సందర్భంగా ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరాజుకు విశిష్ట సేవాభూషణ్‌ పురస్కారం, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారా యణకు విశేష ప్రతిభా పురస్కారాన్ని అందించనున్నట్టు తెలిపారు. ప్రము ఖ సినీ దర్శకుడు బి.గోపాల్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేశిరాజు రాంప్రసాద్‌, గుడాల హరిబాబు, చవాకుల నరేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన చిత్రాలు : తీరం చేరని కెరటం, చివరి శ్వాస, పదిలం, మమ్మీ మహాలక్ష్మి, సైబర్‌ స్లావరీ, నీకోసం, సమతుల్యం, దియా, సరిహద్దు, మార్పు నీకోసం కాదు... రేపటి కోసం, 733, బాలిగాడు.

ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనకు : మధులిక, చిన్ని, చిన్ని మనసులు, మైత్రీ, దేశానికి రైలే ప్రాణం, కనిపించన త్యాగం, జయహో

Updated Date - Sep 04 , 2025 | 12:31 AM