Share News

చికెన్‌ ధర పెరిగింది

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:44 AM

చికెన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. వారం రోజులు నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

చికెన్‌ ధర పెరిగింది

తణుకు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): చికెన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. వారం రోజులు నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కేజీకి రూ.15 పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కిలో రూ.200 నుంచి రూ. 240 పెరిగింది. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరో పక్క చిన్న రైతుల వద్ద కోళ్లు లేకపోవడం, పెద్ద కంపెనీల వద్ద కోళ్లు ఉండడం వల్ల వారికి అనువుగా ధరలు పెంచడం, తగ్గించడం చేస్తున్నారు. చిన్న రైతులు బ్రాయిలర్‌ వేసినా కార్పోరేట్‌ కంపినీలు దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజు 80 వేల కేజీలు అమ్మువడగా ఇపుడు 40 నుంచి 50వేల కేజీలు విక్రయిస్తున్నారు. తణుకు ప్రాంతంలో 30వేలు కేజీలు విక్రయాలు జరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

చిన్న రైతుకు తప్పని నష్టం

ఉమ్మడి జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్లు పెంచే చిన్న రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుతం కోడి లైవ్‌ కేజీ రూ.70. కనీసం రూ.90 ఉంటే కాని రైతుకు గిట్టబాటు కాదు. ధరకోసం చూస్తే మేత, ఇతర ఖర్చులు భారం. ఆదాయం రాక రైతులు నష్టపోతున్నారు.

కంపెనీల వద్ద కోళ్లు అందుబాటులో ఉంటాయి. కంపెనీల వద్ద కోళ్లు ఉన్న సమయంలో రైతులు వద్ద కోళ్లు ఉండవు. కాబట్టి కంపెనీలు ధరలు వారికి అనుకూలంగా లాభాలు వచ్చేవిదంగా ధరలు నిర్ణయించుకుంటారు. పోయిన నష్టాలను రాబట్టుకుంటారు. రైతుకు మాత్రం నష్టం తప్పదు.

మార్కెట్‌ రేటును బట్టి విక్రయాలు

మార్కెట్‌లో చికెన్‌ ధరను బట్టి వినియోగదారు లకు విక్రయిస్తాం. వారం రోజులు నుంచి స్వల్పంగా ధరలు పెరిగాయి. రానున్న వారం రోజులు ఇదే మాదిరిగా ఉండే అవకాశం ఉంది. వినాయక, దశ మి ఉత్సవాల నాటికి ధర పెరగవచ్చు. తర్వాత కార్తిక మాసం మరలా తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి ఒడుదుడుకులు తట్టుకునే రైతులు లేరు. పెద్ద కంపెనీల చేతిలో వ్యాపారం సాగుతుంది.

చిలుకూరి సత్యనారాయణ, వ్యాపారి, తణుకు

Updated Date - Aug 19 , 2025 | 12:44 AM