వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:12 AM
నరసాపురం పట్టణ, మండలాల్లో నిర్వహించే వినాయక చవితి మండపాలకు అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్డీవో దాసిరాజు అన్నా రు.
ఆర్డీవో దాసి రాజు
నరసాపురం టౌన్, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): నరసాపురం పట్టణ, మండలాల్లో నిర్వహించే వినాయక చవితి మండపాలకు అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్డీవో దాసిరాజు అన్నా రు. బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీవేదతో కలిసి గణపతి నవరాత్రులపై అధికారులు, పలు రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సెంటర్లలో ఏర్పాటు చేసే మండపాల వల్ల ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. డీజేలు, బాణసంచా, లౌడ్ స్పీకర్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. బాణాసంచా కాలిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. నిమజ్ఞనాలు నదుల్లోనే జరిగేలా చూడాలన్నారు. తహసీల్దార్ ఐవీవీ సత్యనారాయణ, ఎంపీడీవో వీరభధ్రరావు, కమిషనర్ అంజయ్య, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఉండి/ఆకివీడు/కాళ్ల : వినాయకచవితి ఉత్సవాలకు పోలీసు అధికారుల సూచనలను విధిగా పాటించాలని ఉండి ఎస్‌ఐ నజీరుల్లా కోరారు. ఉండి మండల పరిషత్ కార్యాలయంలో వినాయకచవితి ఉత్సవ కమిటీల వారికి సమా వేశం నిర్వహించి సూచనలు చేశారు. కాళ్ళ మండల పరిషత్ కార్యాలయంలో వినాయక చవితి మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ చవితి వేడుకల్లో నిబంధనలు పాటించాలన్నారు. ఆకివీడు తహసీ ల్దార్ కార్యాలయ ప్రాంగణ హాల్‌లో చవితి ఉత్సవాల నిర్వాహకులతో సీఐ జగదీశ్వరరావు మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతనతో చవితి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.