ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు చర్యలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:17 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఓఎస్డీ తులసీ కౌసిక్ తెలిపారు.
పెదవేగి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఓఎస్డీ తులసీ కౌసిక్ తెలిపారు. కొప్పులవారిగూడెం పంచాయతీ సీతాపురంలో ఆయిల్‌పామ్ తోటలను ఆదివారం ఆయన పరిశీలించారు. 1987లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు నాటిన ఆయిల్ పామ్ చెట్టును ఆయన సందర్శించారు. ఉద్యాన పంటల రాబడిలో రారాజు ఆయిల్‌పామ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ తోటల విస్తరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ ఆయిల్‌పామ్ సాగు అద్భుతంగా ఉందని, సాగులో మెళకువలు, యాజమాన్య విధానాలపై త్వరలో ఛత్తీస్‌గఢ్ నుంచి ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఒక బృందాన్ని ఇక్కడికి పంపిస్తామని ఆయన తెలిపారు. తులసీ కౌసిక్ వెంట కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉండవల్లి వెంకట్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. విక్రమ్‌కిశోర్, జిల్లా కార్యదర్శి కేవీఎస్.వరప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్‌ఎస్‌ఎస్.చక్రధరరావు, చింతలపూడి నియోజకవర్గం కన్వీనర్ వరప్రసాద్, పామాయిల్ రైతు ఉండవల్లి రాము పాల్గొన్నారు.