బీవీఆర్ కళాకేంద్రం, ఆఫీసర్స్ క్లబ్ సరిహద్దు గోడ కూల్చివేత
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:53 PM
తాడేపల్లిగూడెం నడిబొ డ్డున ఉన్న కోర్టు ప్రాంగణం సరిహద్దులో ఉన్న బీవీఆర్ కళాకేంద్రం, ఆఫీసర్స్ క్లబ్‌లకు సంబంధించిన సరహద్దు గోడ మంగళవారం ఉదయం పోలీసుల భారీ బందోబస్తుతో కూల్చి వేశారు.
తాడేపల్లిగూడెంలో భారీ బందోబస్తుతో తొలగింపు
తాడేపల్లిగూడెంరూరల్,ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం నడిబొ డ్డున ఉన్న కోర్టు ప్రాంగణం సరిహద్దులో ఉన్న బీవీఆర్ కళాకేంద్రం, ఆఫీసర్స్ క్లబ్‌లకు సంబంధించిన సరహద్దు గోడ మంగళవారం ఉదయం పోలీసుల భారీ బందోబస్తుతో కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిలో గతంలో నిర్మించిన ఆఫీసర్స్ క్లబ్, బీవీఆర్ కళా కేంద్రం నిర్మాణం చేయగా జిల్లా కోర్టు ప్రాంగణానికి దారికోసం కోర్టు అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఆ భవనాలు తొలగిస్తే కోర్టు ప్రాంగణానికి దారి లభిస్తుందని ఆ భవనాలు ఖాళీ చేయాలని సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. బీవీఆర్ కళాకేంద్ర నిర్వాహకులు, కళాకారులు.. భవనాలు కూల్చొద్దని ప్రతిఘటించారు. దీనిలో భాగంగా మునిసిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ ఏసుబాబు, తహసీల్దార్ ఎం.సునీల్‌కుమార్ పర్యవేక్షణలో గోడ కూల్చివేశారు. దారికి అడ్డుగా ఉన్న చెట్టు, ఆఫీసర్స్ క్లబ్ కొంతభాగాన్ని ఎక్స్‌కవేటర్ల సాయంతో తొలగించారు. ఇరుకు సందులా ఉన్నకోర్టు ప్రాంగ ణానికి వెడల్పయిన మార్గం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు దశాబ్ధా లుగా కళలకు వేదిక అయిన బీవీఆర్ కళాకేంద్రం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా ? అని కళాకారులు, కళా ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు మునిసిపల్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చివేత కొనసాగింది. ఆ సమయంలో తాడేపల్లిగూడెం, తణుకు సర్కిల్ నుంచి భారీగా పోలీసులు మొహరించారు. వాహనాల రాకపోకలు లేకుండా దారి మల్లించారు. సీఐలు ఆదిప్రసాద్, రవికుమార్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.