వచ్చారు..చూశారు..!
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:26 AM
మొంథా తుఫాన్ నష్టాలపై అంచనాకు వచ్చిన కేంద్రబృందం పరిశీలన కార్యక్రమం అరగంటలోనే ముగించేశారు. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, ఉంగు టూరు గ్రామాల్లో పర్యటించాల్సినప్పటికి నారాణయపురంతోనే సరి పెట్టేశారు.
అరగంటలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన
నారాయణపురం పరిశీలనతోనే సరి
మొంథా నష్టాలను నివేదించిన కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు,నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నష్టాలపై అంచనాకు వచ్చిన కేంద్రబృందం పరిశీలన కార్యక్రమం అరగంటలోనే ముగించేశారు. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, ఉంగు టూరు గ్రామాల్లో పర్యటించాల్సినప్పటికి నారాణయపురంతోనే సరి పెట్టేశారు. ఇక్కడ పొలాల్లోకి దిగి రైతుల నుంచి వివరాలను కేంద్ర వ్యవసాయశాఖ, రైతు సంక్షేమశాఖ డైరెక్టర్ కె.పొన్నుస్వామి ఆధ్వర్యంలో సభ్యులు వాటర్ కమిషనర్ డైరెక్టర్ వాసు బాల్రి, కేంద్ర విద్యుత్ అఽథా రిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీసింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్‌కుమార్ మీనాలు సేకరించారు. సాయంత్రం 4.20 గంట లకు జిల్లాకు బృందం రాగా 4.50కు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురా నికి పయనం అయ్యింది. నారాయణపురంలో గొట్టుముక్కల సత్యనారా యణరాజు పొలంలో దెబ్బతిన్న వరిపంటను పరిశీలించింది.తొలుత జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రబృందం పరిశీలించింది. వివరాలను అధికారులను అడిగి తెలుసుకు న్నారు.
జిల్లాలో రూ.72 కోట్ల నష్టం : కలెక్టర్
జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు, గృహలు, విద్యుత్ , రోడ్లు ఇతర నష్టాలను కేంద్ర బృందానికి కలెక్టర్ వెట్రిసెల్వి వివరించారు. జిల్లాలో 72 కోట్ల రూపాయల మేర పంటలకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ కేంద్ర బృందానికి నివేదించారు. 5,703 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని, అధిక శాతం వరి పంట దెబ్బతిందన్నారు. 17.60 హెక్టార్లలో ఉద్యానపంటలు, బొప్పాయి, అరటిపంటలు దెబ్బతిన్నాయన్నారు. 19 ఇళ్లు దెబ్బతిన్నాయని, ఒక గేదె, నాలుగు గొర్రెలు మరణించాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లో 3,422 మందికి పునరావాసం కల్పించామని కలెక్టర్ బృందానికి వివరించారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా వ్యవసాయాఽధికారి హబీబ్ బాషా, జడ్పీ సీఈవో శ్రీహరి, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, ఉద్యానవనశాఖాధికారి షాజా నాయక్, తహసీల్దార్ పూర్ణారావు, ఎంపీపీ ఘంటా శ్రీలక్ష్మీ, సర్పంచ్ అలకనంద తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.