ఏం వరమిస్తారో?
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:11 AM
‘నాకు పీఎం లంక వస్తే.. పుట్టింటికి వచ్చానన్న భావన కలుగుతుంది. తరచూ రావాలని అనుకుంటా. కాని, పని ఒత్తిడితో రాలేకపోతున్నా.. ఇక్కడికి వస్తే.. నా మనసు కు ఎంతో ఆనందం కలుగుతుంది’ గత పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాక
రెండేళ్ల తర్వాత దత్తత గ్రామం పీఎం లంకకు
మూడు గంటలు గ్రామంలోనే..
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోర్సులు ప్రారంభం.. పలు కంపెనీలతో ఎంవోయూలు
సముద్ర కోతకు గురికాకుండా నిర్మిస్తున్న గోడ పరిశీలన.. గ్రామస్తులతో మన్ కీ బాత్
నరసాపురం, నరసాపురం రూరల్, డిసెంబరు 27(ఆం ధ్రజ్యోతి): ‘నాకు పీఎం లంక వస్తే.. పుట్టింటికి వచ్చానన్న భావన కలుగుతుంది. తరచూ రావాలని అనుకుంటా. కాని, పని ఒత్తిడితో రాలేకపోతున్నా.. ఇక్కడికి వస్తే.. నా మనసు కు ఎంతో ఆనందం కలుగుతుంది’ గత పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడ నిర్వహించిన బహి రంగ సభలో పీఎం లంక గురించి చెప్పిన మనసులోని మాట. ఆమెకు ఈ గ్రామంపై ఎంత అభిమానం ఉందో.. ఇటు పీఎం లంక వాసులకు, మంత్రిపై అంతే ఆదరాభిమా నం ఉంది. మంత్రి వస్తున్నారంటే చాలు పండగ వాతావ రణమే. పార్టీలు ఎన్ని వున్నా.. అంతా ఒక్కటై మంత్రికి ఘనస్వాగతం పలికేందుకు వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు.
మారిన గ్రామ రూపురేఖలు
ఒక్కప్పుడు ఈ గ్రామానికి వెళ్లాలంటే సరైన మార్గం లేదు. శిఽథిలమైన వంతెనలు, అధ్వాన రహదారులు.. తాగేందుకు స్వచ్ఛమైన నీరు వుండేది కాదు. వీటికితోడు తరుముకొస్తున్న సముద్రం. ఒకప్పుడు గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో వుండే సముద్రం నేడు అర కిలో మీటరు వరకు వచ్చింది. దీంతో ఎప్పుడు ఏ క్షణంలో గ్రామం కడలి గర్భంలో కలిసిపోతుందా ? అన్న భయం పీఎం లంక వాసుల్లో నెలకొంది. అయితే నేడు ఈ పరిస్థితులు లేవు. గ్రామానికి వెళ్లే రహదారులన్ని బీటీ, సీసీ రోడ్లు అయ్యాయి. ఇందుకు రూ.7 కోట్లపైనే ఖర్చు పెట్టారు. సుమారు రూ.10 కోట్లతో ఉప్పుటేరుపై మూడు భారీ వంతెనలు నిర్మించారు. ఇక గ్రామంలో సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటుచేశారు. వీటికితోడు స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రెండు కోట్లతో డిజిటల్ భవనం ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు కుట్టు, ఎంబైయిండింగ్‌తోపాటు నిరుద్యోగులకు వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ శిక్షణ కేంద్రం ప్రసిద్ధిగాంచింది. సముద్ర కోతకు అడ్డుకట్ట వేసేందుకు రూ.13 కోట్లతో డెలైట్ సంస్థ గోడ నిర్మాణం చేపట్టింది. సంస్థ సామాజిక సేవా కార్యక్రమంలో ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. గ్రామంలో రూ.30 కోట్లపైనే అభివృద్ధి పనులు జరిగాయంటే.. దీనికి కారణం నిర్మలమ్మ దయే అంటారు పీఎం లంక వాసులు. కోతకు గురవుతున్న ప్రాంతంలో ప్రస్తుతం వెయ్యి మీటర్లు మాత్రమే నిర్మిస్తున్నారు. దీన్ని మరింత పెంచితే గ్రామానికి ముంపు తగ్గుతుందని స్థానికుల నమ్మకం. దీనిపై ఎలాంటి ప్రకటన చేస్తారోనని, మత్స్యకారుల జీవన స్థితిగతులు పెంచేందుకు ఎలాంటి వరం ఇస్తారోనని అంతా ఆశగా చూస్తున్నారు.
కేంద్ర మంత్రి పర్యటన షెడ్యూలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం మూడు గంటలపాటు పీఎం లంకలో పర్యటించనున్నా రు. ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పీఎం లంకకు చేరుకుంటారు. కమ్యూనిటీ భవనంలో మన్ కీ బాత్ నిర్వహిస్తారు. వికసిత్ భారత్, డిజిటల్ ఇండియా లో భాగంగా డ్రోన్లు, కృతిమ మేధస్సు, నైపుణ్య శిక్షణ కోర్సులు ప్రారంభిస్తారు. శిక్షణ ఇచ్చే కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంటారు. జాతీయ బ్యాంకుల సామాజిక సేవా కార్యక్రమాల్లో లబ్ధిదారులకు చెక్‌లు, మత్స్యకారులకు రూ.కోటి విలువ చేసే సామగ్రి, మహి ళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారు. చిత్ర లేఖనం, వందేభారత్ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులందిస్తారు. రూ.13 కోట్లతో డెల్ సంస్థ నిర్మిస్తున్న గోడ నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అనంతరం కవిటం వెళ్లి సోమే శ్వరస్వామికి పూజలు చేసి, 4.15కి విజయవాడ బయలు దేరతారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.