Share News

గుడికి భద్రత

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:44 AM

జిల్లాలోని అన్ని దేవాలయాలను భద్రత పెంచడంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

గుడికి భద్రత
కొల్లేరు పెద్దింటమ్మ గుడి వద్ద సీసీ టీవీ పుటేజ్‌

సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం

జిల్లాలో 601 ఆలయాలకు 2,461 కెమెరాలు అవసరం

అంచనా సిద్ధం చేసిన దేవదాయ శాఖ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని అన్ని దేవాలయాలను భద్రత పెంచడంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఆలయానికి ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. భక్తుల రద్దీకి తగినట్లు సౌకర్యాల కల్పనపై దేవదాయశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని దేవాలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి.

జిల్లాలో కొత్తగా 601 దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికా రులకు నివేదించారు. 6సీ కింద రూ.15 లక్షల ఆదాయం వచ్చేవి. నాలుగు చొప్పున అమర్చినా 2,461 కెమెరాలు అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయంలో రథం దహనం సంఘటన నేపథ్యంలో అప్పట్లో జిల్లాలో 160 ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పేరొందిన కొల్లేటి కోట పెద్దింటమ్మ గుడికి 16 సీసీ కెమెరాలున్నాయి. ప్రసిద్ధ ఆలయాలు, రథం ఉండే గుడికి ఒక సీసీ కెమెరా అమర్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

స్టోరేజీ పెంపు..

ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న దేవాలయాల్లో 15 రోజుల బ్యాక్‌అప్‌ (స్టోరేజీ) కెపాసిటీ మాత్రమే ఉంది. తాజాగా సీసీ కెమెరా బ్యాక్‌అప్‌ కనీసం 90 రోజులు (3నెలలు) ఉండేలా ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ ఉత్తర్వులిచ్చింది. కెపాసిటీ పెంపు దేవదాయశాఖ చేప డుతుందా? ఆలయ కమిటీ చేపట్టాలన్న దానిపై స్పష్టత లేదు. సీసీ కెమెరాల ఏర్పాటుపై దేవదాయశాఖ అసి స్టెంట్‌ కమిషనర్‌ కూచిపూడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు వివరాలను అడిగారని, నివేదిక సమర్పించామన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:44 AM