Share News

కుక్కలను చంపినవారిపై కేసు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:41 AM

ఫారమ్‌ వద్ద కుక్కలు కోళ్లను తింటున్నాయనే కారణంతో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి 9 కుక్కలను హతమార్చిన సంఘటనపై ఏలూరు త్రిటౌన్‌ పోలీసులు కేసు నమో దు చేశారు.

కుక్కలను చంపినవారిపై కేసు

ఏలూరు క్రైం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ఫారమ్‌ వద్ద కుక్కలు కోళ్లను తింటున్నాయనే కారణంతో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి 9 కుక్కలను హతమార్చిన సంఘటనపై ఏలూరు త్రిటౌన్‌ పోలీసులు కేసు నమో దు చేశారు. కాకినాడకు చెందిన సూరాబత్తుల గోపాలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 27న సాయంత్రం 4.30 గంటలకు శనివారంపుపేట ఏటిగట్టు శివారు ప్రాం తంలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి తుపాకీతో ఆ ప్రాం తంలో ఉన్న 9కుక్కలను హతమార్చి వెళ్లిపోయారు. అంతేకాకుండా ప్రశ్నించిన కుక్కల యజమానులను బెదిరించారు. ఈ సంఘటనను ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక మే నెల 30న వెలుగులోకి తీసుకొచ్చింది.దీంతో పోలీస్‌ అధికారులు నిఘా పెట్టారు. కాకినాడకు చెందిన జంతు సం రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి సూరాబత్తుల గోపాలరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. రెండ్రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే నిందితులను గుర్తించినట్లు సమాచారం.

Updated Date - Jun 03 , 2025 | 12:41 AM